రాజాసింగ్ కు ఊహించని దెబ్బ- ఆ నేతే కారణమా..!!
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊహించని షాక్ తగిలింది. బీజేపీ వాయిస్.. హిందుత్వ అజెండా బలంగా వినిపించే ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను చెప్పే అవకాశం కోల్పోయారు. గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా రాజాసింగ్ కు చెందిన రెండు పేస్ బుక్ పేజీలతో పాటుగా మూడు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ను తెలిగించారు. దీని పైన రాజాసింగ్ స్పందించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్ షిప్ దాడి చేస్తోందని మండిపడ్డారు.
విద్వేష పూరిత ప్రసంగాలు
బీజేపీ ఎమ్మెల్సీ రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాల రద్దు వ్యవహారం వివాదాస్పదంగా మారు తోంది. ఒకే సారి 2 ఫేస్ బుక్ పేజీలు, 3 ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ తెలిగించారు. దీని పైన రాజా సిం గ్ సీరియస్ గా స్పందించారు. తన కుటుంబంతో పాటుగా తన స్నేహితులు, కార్యకర్తలు, మద్దతు దారు ల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తన సోషల్ మీడియా ఖాతాలను తెలిగించారని రాజా సింగ్ ఆరోపించారు. గతంలో రాజాసింగ్ చేసిన విద్వేష పూరిత ప్రసంగం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కేసులు నమోదు
రాజాసింగ్ పై ఆ ప్రసంగం కారణంగా కేసు నమోదు చేసారు. జైలుకు వెళ్లారు. బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సోషల్ మీడియా ఖాతాల్లో సున్నిత మైన అంశాల పై రాజాసింగ్ వ్యవహ రించే తీరు పైన ఫిర్యాదులు వచ్చాయి. దీంతో.. పలు సందర్భాల్లో ఆయన పైన కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే మెటా చర్యలు చేపట్టింది. 2024 లో బీజేపీకి చెందిన పలువురు నేత ల అభ్యంతర కర ప్రసంగాలు సోషల్ మీడియా లో పోస్టు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కాగా, రాజాసింగ్ చేసిన ప్రసంగంలో 74.5 శాతం ద్వేషపూరితమని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక పేర్కొంది.
ఖాతాల తొలిగింపు
రాజాసింగ్ చేసిన 219 ప్రసంగాలను పరిశీలించారు. వాటిల్లో ఫేస్‌బుక్‌లో అత్యధికంగా 164 ప్రసంగాలు పోస్టు చేసినట్లు తె రాజాసింగ్ చేసిన మొత్తం ప్రసంగాలలో 74.9 శాతం, తరువాత యూట్యూబ్‌లో 22.4 శాతం,ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు ద్వేషపూరితమని తేల్చారు. ఈ నివేదిక ఆధారంగా ఇప్పుడు రాజాసింగ్ ఖాతాల పైన మెటా చర్యలు తీసుకుంది. అయితే, పూర్తిగా వీటిని రద్దు చేసినట్లేనని చెబుతున్నా... కొంత కాలం తరువాత తిరిగి పరిశీలిస్తారా లేదా అనేది మరింత స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications