Monsoons: తెలంగాణ రైతులకు శుభవార్త.. జూన్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..!

వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినా రాష్ట్రలో వర్షాల జాడ కనబడడం లేదు. రుతుపవనాల ఆలస్యంతో వర్షాలు పడడం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఎట్టకేలకు వాతావరణ శాఖ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది. మరో మూడు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. జూన్ 21 వరకు రాష్ట్రంలో రుతుపవనాలు రావొచ్చని పేర్కొంది. అయితే జూన్ 25 తెలంగాణలో స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

శనివారం నుంచి వ్యవసాయ పనులు ప్రారంభించుకోవచ్చని సూచించింది. అరేబియా సముద్రంలో ఏర్పాడిన బిపార్ జాయ్ తుఫాన్ వల్ల రుతుపవనాలు ఆలస్యంగా వస్తున్నట్లు వివరించింది. నిన్నటి వరకు రుతుపనాలు నెమ్మదిగా కదిలాయని.. ఇప్పుడు కాస్తం చురుకుగా ఉన్నట్లు తెలిపింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ ఎండలు మండి పోతున్నాయి.

Meteorological department has said that Monsoon will enter Telangana on June 21

మంగళవారం కూడా తెలంగాణలో కోన్ని జిల్లాల్లో వడ గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కరీంనగర్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో వడ గాలులు వీస్తాయని పేర్కొంది. తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించడానికి మూడు రోజుల సమయం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 22, 23, 24 రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించనున్నాయి.

అటు ఏపీలో రుతుపనాలు ఇప్పటికే ప్రవేశించాయి. రాయసీమలోకి రుతుపవనాలు వచ్చినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల రాకతో స్వల్పంగా వర్షాలు పడతాయని చెప్పింది. రుతుపవనాలు తమిళనాడు మీదుగా రాయలసీమలోని పలు ప్రాంతాలపై విస్తరిస్తూ .. దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడింంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+