Rain: రైతులకు శుభవార్త.. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!
తెలంగాణలో చాలా జిల్లాల్లో భూ గర్భ జల మట్టాలు పడిపోయాయి. కొన్ని చోట్ల నీరు లేక పంటలు ఎండి పోతున్నాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న(మక్క) నీరు లేక ఎండి పోతున్నాయి. దీంతో రైతులు పైరును కాపాడుకునేందుకు అనే ప్రయత్నాలు చేస్తున్నారు. పగలు, రాత్రి పొలం వద్దే ఉండి నీరు పెడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ, నిజమాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో నీరు లేక పంటలు వాడు ముఖం వేశాయి.
దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు లేకుంటే పంటలు ఎండిపోతాయని బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రైతులకు శుభవార్త అందించింది. వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. అదే ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొన్నారు. మరఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అంతర్గతంగా కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని చెప్పింది.

దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. వానలతో రాష్ట్ర వాసులు ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు లతో పాటు
భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే వర్షాల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 27 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశలున్నాయని అంచనా వేసింది. ఇక శనివారం హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. కాస్త ఉష్ణోగ్రత కూడా తగ్గింది.












Click it and Unblock the Notifications