Semiconductor: మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్..
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్‌లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. నాస్కామ్ ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే సృష్టించినట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరిస్తున్నదన్నారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేటీఆర్ చెప్పారు. బెంగళూరు, చెన్నై నగరాల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందని చెప్పారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ తన వర్క్‌ఫోర్స్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

సెమీకండక్టర్ రంగంలో భారత్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తొందని.. వచ్చే 10 ఏళ్లలో ఈ రంగంలో ఇండియా దూసుకెళ్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కిలింగ్ రంగంలో కూడా తెలంగాణ అగ్రగామిగా నివుస్తుందని చెప్పారు. భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జీనోమ్ వ్యాలీ హెడ్ క్వార్టర్స్ టాస్క్ ద్వారా విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు.

మైక్రోచిప్ సంస్థ అధినేతలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోచిప్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో చాండ్లర్‌లో మైక్రోచిప్ టెక్నాలజీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉందన్నారు. స్మార్ట్, కనెక్టడ్, సెక్యూర్ ఎంబెడ్ కంట్రోల్ సొల్యూషన్స్ ఆ కంపెనీ కల్పిస్తోందని కేటీఆర్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్, ఏరోస్పేస్, డిఫెన్స్, కంప్యూటింగ్ మార్కెట్లకు చెందిన లక్షా 25వేల మంది కస్టమర్లకు ఆ కంపెనీ సేవల్ని అందిస్తోందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications