Telangana: మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం
Telangana: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో రాష్ట్ర సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది.
నూతన క్యాంపస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు హైదరాబాద్ తో సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని సీఎం తెలిపారు. మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ)ని వినియోగిస్తూ బోధన కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ కు సీఎం ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే మైక్రోసాఫ్ట్ భారత్ కు వచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేసిందన్నారు. మా ప్రభుత్వం సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తోందని గర్వంగా చెబుతున్నామని ఆయన అన్నారు. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని సీఎం చెప్పారు. ఆవిష్కరణల పట్ల మైక్రోసాఫ్ట్ నిబద్ధత.. మా తెలంగాణ రైజింగ్ విజన్ కు తోడవుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications