హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. 'నైట్ సఫారీ' పార్కు.. 203 ఎకరాల్లో..
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. నగరంలోని ప్రజల కోసం 'నైట్ సఫారీ' పార్కు సిద్ధం అవుతోంది. ముచ్చర్లలో దాదాపు 203.83 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే పూర్తయ్యాయి. సెలవులు, వీకెండ్స్ లో పిల్లలతో కలిసి హాయిగా విహరించేలా ఈ పార్కు నిర్మాణం జరుగుతోంది. ప్రకృతి ఒడిలో వినోదం, విజ్ఞానం,సాహసం.. అన్నీ ఒకేచోట దొరికేలా ఈ పార్క్ ను రూపొందిస్తున్నారు అధికారులు. పిల్లలకోసం ఇక్కడే డైనోసార్ పార్కు, వర్చువల్ రియాలిటీ (VR) పార్కు వంటి ప్రత్యేకమైన ఆకర్షణలు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా ఈ పార్కు నిర్మాణం జరుగుతోంది.
ఈ నైట్ సఫారీ జూ పార్క్‌ను రెండు దశల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇప్పటికే 203.80 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) నుంచి ఆమోదం లభించింది. ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ను ఎఫ్‌డీసీ నిర్మాణం చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను పూర్తి చేసింది.

ప్రత్యేకతలు ఓ సారి చూస్తే.. ఈ నైట్ సఫారీలో పిల్లల కోసం డైనోసార్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రాచీన, మధ్య యుగ చారిత్రక కట్టడాలు ఆనాటి వాతావరణం, భారీ డైనోసార్ నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే యువత కోసం అడ్వెంచర్ పార్కును ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్నారు.
సాధారణంగా జూ పార్కులు ఉదయం నుంచి సాయంత్రం వరకే ఓపెన్ ఉంటుంది. కానీ ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న నేషనల్ జూ పార్క్ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నైట్ సఫారీ ద్వారా రాత్రిపూట వన్యప్రాణుల సహజ ప్రవర్తనను ప్రత్యక్షంగా చూడొచ్చు. భారత లో లేని అరుదైన జంతువులను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. అలాగే జిరాఫీ, జీబ్రా, అన్టిలోప్, ఎలాండ్ వంటి విదేశీ ఖండాల శాకాహార జంతువులను ఇక్కడకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఇక వీటితోపాటు టికెట్ కౌంటర్లు, పార్కింగ్ ప్రాంతం, ఫుడ్ కోర్ట్ లు ఏర్పాటు చేయనున్నారు.












Click it and Unblock the Notifications