రూ.800 కోట్లతో హైదరాబాద్‌లో మిలిటరీ డ్రోన్ ప్లాంట్..!
హైదరాబాద్ వేదికగా మరో భారీ ప్లాంట్ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగర శివార్లలోని మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో ఈ అధునాతన డ్రోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.800 కోట్ల (9 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికా సంస్థ షీల్డ్ ఏఐతో కలిసి అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (యూఏఎస్) ప్లాంట్‌ను నెలకొల్పుతున్నట్లు జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ వ్యవస్థాపకుడు పార్థ జిందాల్ వెల్లడించారు.
ప్రపంచంలోనే తొలి వర్టికల్ టేకాఫ్-ల్యాండింగ్ (వీటీఓఎల్), గ్రూప్ 3 యూఏఎస్ వీ-బీఏటీ డ్రోన్ల తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిందాల్ తెలిపారు. ఈ ప్లాంట్ భారత సైన్యం అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం అవసరమైన మానవ రహిత డ్రోన్లను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు చెప్పారు. కాగా వచ్చే ఏడాది నవంబరు నాటికల్లా ఈ అడ్వాన్స్‌డ్ మిలిటరీ డ్రోన్ ప్లాంట్ అందుబాటులోకి రానుందని స్పష్టం చేశారు.

అంతే కాకుండా ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 300 వీ-బీఏటీ డ్రోన్స్ అని వెల్లడించారు. భవిష్యత్తులో డిమాండ్ ఉంటే ఈ సామర్థ్యాన్ని 450కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. జెట్ ఇంధనంతో నడిచే ఈ డ్రోన్ 70 కిలోల పేలోడ్‌తో ఏకధాటిగా 12 గంటలు ప్రయాణిస్తుందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతక్ష్యంగా 300 మందికి.. పరోక్షంగా 1,500 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికే టెక్నాలజీ కొనుగోలు, శిక్షణ, ఐదు వీ-బీఏటీ డ్రోన్ల దిగుమతి కోసం రూ.320 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు.
మరోవైపు డిఫెన్స్ స్ట్రాటజిక్ హబ్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అందుకోసం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వివరించారు. డ్రోన్ తయారీ, టెస్టింగ్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అడ్వాన్స్‌డ్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, డిఫెన్స్ ఇన్నోవేషన్‌లో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు దశలవారీగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో దేశీయ, అంతర్జాతీయ రక్షణ దిగ్గజ సంస్థలు ఉండటం మరింత కలిసిరానుందన్నారు. 2030 నాటికి భారత రక్షణ యూఏవీ, డ్రోన్ మార్కెట్ విలువ 500 కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని, దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ కేంద్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద ఆర్డర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ డ్రోన్ల తయారీ ప్రాజెక్టుకు ముందు.. జేఎస్‌డబ్ల్యూ చండీగఢ్‌లో రక్షణ రంగంలో ఇతర జాయింట్ వెంచర్‌లను చేపట్టింది. ఒక ఉక్రేనియన్ సంస్థతో జేఎస్‌డబ్ల్యూ జెకో మోటార్స్ JV ద్వారా ప్రత్యేక మొబిలిటీ వాహనాలను తయారు చేసింది. సుమారు 18 నెలల క్రితం ప్రారంభమైన ఈ యూనిట్ భారత సైన్యానికి.. ఐక్యరాజ్యసమితికి 200 వాహనాలను సరఫరా చేసింది. అదే కేంద్రంలో ఆఫ్-రోడ్ వాహనాల కోసం ఒక అమెరికన్ సంస్థతో మరో JV కూడా ఉంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications