ప్లాట్‌ఫాం బదులు రైలు ప్రయాణ టిక్కెట్‌కు చెక్!: ధర రూ.5 నుంచి రూ.10కి పెంపు
న్యూఢిల్లీ: రైలు టికెట్టు కనీస ధరను 5 రూపాయల నుంచి 10 రూపాయలకు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. నవంబరు 20వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. ఈ కనీస ధరను కేవలం సెకండ్ క్లాస్ నాన్ సబర్బన్ రైళ్లకు మాత్రమే వర్తింపజేశారు.
గత ఏడాది రైల్వే బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా గత ఏప్రిల్ నుంచి ప్లాట్‌ఫాం టికెట్లను రూ.10కి పెంచారు. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫాం టిక్కెట్ ధరను పెంచారు. అయితే సెకండ్ క్లాస్ టికెట్టు కనీస ధర రూ.5 కావడంతో ప్లాట్‌ఫాం టికెట్టు ధర పెంచినా ఉపయోగంలేకుండా పోయింది.

స్టేషన్లలో రద్దీ తగ్గించేందుకు ప్లాట్ ఫాం టిక్కెట్ ధర పెంచితే.. ప్లాట్ ఫాం టిక్కెట్‌కు బదులు కనీస ధర ఉన్న సెకండ్ క్లాస్ టిక్కెట్ కొంటున్నారు. దీంతో రైల్వే శాఖ నాన్ సబర్బన్ రైళ్లలో కనీస ఛార్జీని రూ.10కి పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 20వ తేదీ నుంచి ప్లాట్ ఫాం టిక్కెట్‌తో పాటు కనీస ధర రూ.10 ఉంటుందని, ప్లాట్ ఫాం పైన రద్దీని తగ్గించే దృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ చర్యలు ప్లాట్ ఫాం పైన రద్దీని తగ్గిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications