Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్..!

తెలంగాణ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. కేబినెట్ సమావేశాల గురించి బీఆర్ఎస్ నేతలు అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ చర్చలోకి రాలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు.

హరీష్ రావుకు మంత్రి సవాల్..

ఈ మేరకు మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామా? అంటూ సవాల్ చేశారు. హరీష్ రావుకు ఎంతో సెంటిమెంట్‌గా ఉన్న దేవుడిపై ప్రమాణం చేయగలడా? ఇద్దరం తడిబట్టలతో ఆలయంలో ప్రమాణం చేద్దాం అని ఫైర్ అయ్యారు. తాను తన తల్లిదండ్రులపై ప్రమాణం చేసి నిజం చెబుతానని.. ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని వస్తానని చెప్పుకొచ్చారు. హరీష్ రావు ఆరోపించిన విషయాలను నిజమని ప్రమాణం చేయగలడా? అని అన్నారు.

minister-adluri-lakshman-challenges-ex-minister-harish-rao

అలాగే హరీష్ రావు తనకు ఏ శనివారం సమయం కేటాయిస్తారో చెప్పాలని అడిగారు. హరీష్ రావు ఈ సవాల్‌ను స్వీకరించాలని చెప్పారు. కొండా సురేఖ బిడ్డ తమ అందరికీ బిడ్డ లాంటిదే అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అలానే కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా? ఇది ఎంత దారుణం? మంత్రులపై ఈ విధంగా అబద్ధ ఆరోపణలు చేయడం పూర్తిగా అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్‌లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. హరీష్ రావు చేసిన ఆరోపణలపై వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ అంటే అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అని.. ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో వారికి సాటి ఎవ్వరూ లేరని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అణచివేత పాలన కొనసాగించారో అందరికీ తెలుసని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు 600 పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదే అని విమర్శించారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు.. పదేండ్లు మేమే రాజులం, మేమే మంత్రులం అన్నట్టు వ్యవహరించారన్నారు. ప్రజల బాధలు వినకుండా, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి తమ అహంకార పాలన నడిపారని తెలిపారు. హరీష్ రావు నిజాయితీ గల వ్యక్తి అయితే ప్రజల ముందే ప్రమాణం చేయాలని.. తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పారు. ఆయన సవాల్‌ను స్వీకరిస్తే నిజాలు బయటపడతాయని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+