Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాములమ్మ డైనమిక్ లీడర్.. వరంగల్ గడ్డపై విజయశాంతిని పొగిడిన మంత్రి ఎర్రబెల్లి

సంక్రాంతికి విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయోత్సవ సభను వరంగల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో హీరోయిన్లు మహేష్ బాబు,రష్మికతో పాటు ఇతర నటీనటులు,దర్శక నిర్మాతలు,టెక్నీషియన్లు హాజరయ్యారు. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి విజయశాంతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

విజయశాంతిని పొగిడిన ఎర్రబెల్లి

విజయశాంతిని పొగిడిన ఎర్రబెల్లి

వరంగల్ గడ్డపై సరిలేరు నీకెవ్వరు సక్సెస్ సభను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఎర్రబెల్లి.మహేష్ బాబు స్వయంగా ఫోన్ చేసి వరంగల్‌కి వస్తున్నామని చెప్పాడని.. అందుకు తాను చాలా సంతోషించానని చెప్పారు. సినీ ఇండస్ట్రీ వాళ్లు హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అడ్డాగా చేసుకోవాలని సూచించారు. ఇక సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్ర పోషించిన విజయశాంతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.30 ఏళ్ల నుంచి తన మిత్రురాలు, డైనమిక్ లీడర్ అయిన విజయశాంతి వరంగల్ రావడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థి అయిన విజయశాంతిని ఎర్రబెల్లిని డైనమిక్ లీడర్‌ అని పొగడటం హాట్ టాపిక్‌గా మారింది.

అనిల్ రావిపూడి స్పీచ్..

అనిల్ రావిపూడి స్పీచ్..

ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు పాదాభివందనం చేస్తున్నానని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన హీరో మహేష్ బాబుకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే చిత్రంలోని టీనటులు,టెక్నీషియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా కమర్షియల్ నాడి పట్టుకోవడం చాలా కష్టమని, ప్రేక్షకులే ఆ నాడిని పట్టుకోగలరని అన్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో నటీనటులు,ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉన్నారని.. అదే తనకు పెద్ద సంతోషమని చెప్పారు. ఒక దర్శకుడిగా నిర్మాతకు డబ్బులు,ఆర్టిస్టుల ముఖాల్లో నవ్వులు.. ఇదే తాను ఫాలో అవుతానని చెప్పారు.

ఏడు రోజులకే వంద కోట్ల షేర్..

ఏడు రోజులకే వంద కోట్ల షేర్..

ఇంత పెద్ద హిట్‌ను చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. డిస్ట్రిబ్యూటర్ల ముఖంలో చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 7వ రోజుకే సినిమా లాభాల్లోకి వచ్చిందని..ఇప్పటివరకు 100 కోట్లు షేర్ రాబట్టిందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పారు. సినిమా మొదలైనప్పటి నుంచి తమకు నమ్మకం ఉందని.. ఇప్పుడు కలెక్షన్ల రూపంలో అది నిజమైందని చెప్పారు. ఇప్పటి నుంచి మహేష్ బాబు ప్రతీ సినిమాలో మైండ్ బ్లాంక్ తరహా పాట ఒకటి ఉండాలని కోరారు. ఇక ఈ సినిమా విజయశాంతి రీఎంట్రీకి సరిగ్గా సరిపోయిందని భావిస్తున్నట్టు చెప్పారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ఆంధ్రా తెలంగాణ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆల్ హ్యాపీస్ అన్న దిల్ రాజు

ఆల్ హ్యాపీస్ అన్న దిల్ రాజు

సినిమా సక్సెస్ అయితే అందరం కలిసి తిరుపతికి వెళ్లాలనుకున్నామని.. అనుకున్నట్టుగానే దర్శనం చేసుకున్నామని చెప్పారు. ఎవరైనా తిరుపతి దర్శనం తర్వాత నేరుగా ఇంటికి వెళ్తారని.. కానీ తాము వరంగల్‌కి వచ్చామని చెప్పారు. వరంగల్‌ను తాము సొంతింటిలా భావించాం కాబట్టే ఇక్కడికి వచ్చామన్నారు. ఈ రోజుల్లో ఒక సినిమా ఏడు రోజుల్లో లాభాల్లోకి రావడం అరుదు అని, సరిలేరు నీకెవ్వరుతో
అది సాధ్యమైందని చెప్పారు. సినిమా చేసినందుకు ప్రతీ ఒక్కరూ హ్యాపీగా ఉన్నారని చెప్పారు. ఇండస్ట్రీలో వరుసగా ఐదు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం అనిల్ రావిపూడికే చెల్లిందన్నారు.

విజయశాంతి స్పీచ్

విజయశాంతి స్పీచ్

నటి విజయశాంతి మాట్లాడుతూ.. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు శిరసు వంచి కృతజ్క్షతలు తెలుపుతున్నట్టు చెప్పారు. 13ఏళ్లకు ముందు తనను ఏ రకంగా ఆదరించారో.. ఇప్పుడూ అలాగే ఆదరిస్తున్నారని చెప్పారు. నిజానికి తాను మళ్లీ సినిమా చేయకూడదని భీష్మించుకుని కూర్చున్నానని.. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన సబ్జెక్ట్ నచ్చి సినిమా చేశానని చెప్పారు. సినిమాలో జవాన్ల జీవితాల గురించి అనిల్ రావిపూడి చక్కటి సందేశం ఇచ్చారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+