వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ వల్లే తెలంగాణాలో అభివృద్ధి; త్వరలోనే వరంగల్లో ప్రపంచస్థాయి వైద్యం: మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో గత 40 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కెసిఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్ సీఎం హాస్పిటల్ లో రూ.2 కోట్ల 14 లక్షల విలువైన కొత్త సీటీ స్కాన్ యంత్రాన్ని ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంజీఎం ఆస్పత్రికి గురించి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే వరంగల్ లో ప్రపంచస్థాయి వైద్యం అందుబాటులోకి

త్వరలోనే వరంగల్ లో ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులోకి రాబోతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. పాత సెంట్రల్ జైలు స్థలంలో 11 వందల కోట్లతో ఇరవై నాలుగు అంతస్తుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.ఎంజీఎం ఆస్పత్రికి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి విశ్లేషించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు.

వరంగల్ హెల్త్ హబ్ గా.. హైదరాబాద్ తర్వాత వరంగల్ లో మెరుగైన వైద్యం

సీఎం కేసీఆర్ దిశానిర్దేశం తో, మంత్రి హరీష్ రావు పనితనంతో రాష్ట్రం అలాగే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యరంగం అభివృద్ధి చెందుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ ను హెల్త్ హబ్ గా ప్రకటించారని గుర్తుచేశారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్య సదుపాయాలు వరంగల్ లో ఏర్పాటు అవుతున్నాయి అంటూ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

ప్రజలకు సేవలు అందించటం కోసం వైద్యులు ఎప్పుడూ సిద్దంగా ఉండాలి

కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. అదే తరహాలో ఇక్కడ వైద్యసేవలు నిరంతరం అందాలని ప్రజలు, ప్రభుత్వం కోరుకుంటున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అందుకు తగ్గట్లుగా ఎంజీఎం డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఆస్పత్రిలో పారిశుధ్యంపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.

ఎంజీఎం ను అప్ గ్రేడ్ చేసి అన్ని వసతులు కల్పిస్తున్నాం


ఇక ఎంజీఎం లో బయోమెట్రిక్ పద్ధతి అమలు అవుతున్నదని పేర్కొన్నారు. ఎంజీఎంలో ప్రస్తుతం అన్ని రకాల మెరుగైన వసతులు కల్పించామని తెలిపారు. ఎంజీఎం ను 1,000 పడకల నుండి 1,300 పడకలకు అప్ గ్రేడ్ చేశామని వెల్లడించారు. ఇక ఐ.సి.యు బెడ్లు 100 ఉండగా 180 కి పెంచామని, వెంటిలేటర్ బెడ్లు 25 నుండి 200 బెడ్లకు పెంచామని పేర్కొన్నారు. ఎంజీఎం లో రెండు ఆక్సిజన్ ట్యాంక్ లు మరియు ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా ఏర్పాటు చేశామన్నారు .

English summary
Minister Errabelli Dayakar Rao said that development has taken place in Telangana since the arrival of KCR and world class medicine will soon be available in Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X