• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు.. ఆ సంగతి మరిచిపోవద్దు.. బండిపై భగ్గుమన్న ఈటెల..

|

టెస్టులు చేయకపోవటం వల్లే తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల చేసిన విమర్శలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తిప్పి కొట్టారు. గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు పరీక్షలు చేయరని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా మాత్రమే చేయాలనే విషయం తెలుసుకోవాలన్నారు. ఎన్ని పరీక్షలు చేస్తున్నామన్న దానికంటే.. ఎంత కచ్చితత్వంతో పరీక్షలు చేస్తున్నామన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు.

మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు..

మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు..

ఇలాంటి విపత్కర సమయంలో భాద్యతారాహిత్యంగా అవగాహన లేకుండా మాట్లాడవద్దని ఈటెల రాజేందర్ సూచించారు. కుల,మత,రాజకీయాలకు అతీతంగా కరోనాపై పోరాడుదామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిస్తుంటే, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం లేనిపోని ఆరోపణలు,విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మత రాజకీయాలు తెలంగాణలో చెల్లవని అన్నారు.ఇండోనేషియా వాళ్ళు ఢిల్లీ వచ్చి అక్కడి నుండి కరీంనగర్ వస్తే వారిని గుర్తించి కరోనా మూలాలను కేంద్రానికి తెలియజేసిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు.

 ఆ సంగతి మరిచిపోవద్దు..

ఆ సంగతి మరిచిపోవద్దు..

మర్కజ్ కాంటాక్ట్స్‌ను గుర్తించకపోయి ఉంటే దేశంలో హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదయ్యేవని ఈటెల అన్నారు. ఢిల్లీలో శాంతి భద్రత బీజేపీ ప్రభుత్వం చేతిలోనే ఉండి కూడా ఎందుకు మర్కజ్‌ను కనుక్కోలేకపోయారని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉంటే ఢిల్లీలో సమావేశాలకు అనుమతి ఇచ్చింది మీరే అనే విషయం మరచిపోవద్దు అని గుర్తుచేశారు.మర్కజ్ కాంటాక్ట్స్‌ను గుర్తించే క్రమంలో పోలీసులు,వైద్య సిబ్బందిపై దాడులు జరిగినా.. తాము వెనుకడుగు వేయలేదన్నారు. పక్కా ప్రణాళికతో పాజిటివ్ కేసులను ట్రేస్ చేస్తున్నామన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్న ఈటెల.. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే కింగ్‌ కోఠి ఆస్పత్రికి రావాలని విజ్ఞప్తి చేశారు.

కొత్తగా 6 పాజిటివ్ కేసులు

కొత్తగా 6 పాజిటివ్ కేసులు

కేంద్ర బృందం ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించి గచ్చిబౌలి ఆసుపత్రిని చూసి అబ్బురపడిందన్నారు. గాంధీలో జరుగుతున్న చికిత్స పట్ల హర్షం వ్యక్తం చేసిందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కూడా తెలంగాణ ప్రభుత్వ చర్యలను ప్రశంసించారని చెప్పారు. ఇది చూసి జీర్ణించుకోలేని రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్ర బృందం దగ్గరికి వెళ్ళి నిజమా కాదా అని ఆరా తీయడం సిగ్గుచేటు అన్నారు.

శుక్రవారం(ఏప్రిల్ 1)న తెలంగాణలో కొత్తగా మరో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1044కి చేరుకుందన్నారు. శుక్రవారం 22 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పటివరకూ మొత్తం 464 మంది డిశ్చార్జి అయ్యారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 552 ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకూ 28 మంది మృతి చెందినట్టు తెలిపారు.

బండి సంజయ్ విమర్శలు.. మత ప్రాతిపదికన లాక్ డౌన్ అమలు అంటూ..

బండి సంజయ్ విమర్శలు.. మత ప్రాతిపదికన లాక్ డౌన్ అమలు అంటూ..

రెండు రోజుల క్రితం ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా కేసులపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. టెస్టులు చేయవద్దని కేంద్రం, ఐసీఎంఆర్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. తెలంగాణలో రోజుకు రెండు వేల టెస్టులు చేసే సామర్థ్యం ఉందని బండి సంజయ్ తెలిపారు. కానీ ప్రస్తుతం రంజాన్ మాసం దృష్ట్యా ప్రణాళిక ప్రకారమే కరోనా టెస్టులు ఆపేశారన్నారు. ఒవైసీ ఒత్తిడితోనే మృతుల నమూనాలను పరీక్షించటం లేదన్నారు. పాతబస్తీలో లాక్‌డౌన్ అమలు చేసే దమ్ము కేసీఆర్‌కు లేదని బండి సంజయ్ విమర్శించారు. మత ప్రాతిపదికన సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారన్నారు.

English summary
Minister Etela Rajender made a counter statement on MP Bandi Sanjay,he said Telangana government is following ICMR guidelines to do coronavirus tests in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X