ఆస్పత్రికి పరుగు తీసిన హరీశ్ రావు: కొత్త ప్రభాకర్ రెడ్డికి సర్జరీపై మీడియాతో ఏమన్నారంటే?
హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హణీయమన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.
సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు దాడి జరిగిందని తెలిపారు. రాజు అనే వ్యక్తి దాడి చేశాడు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైద్యులు సర్జరీ చేస్తున్నారు. అనంతరం వైద్యులు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై వెల్లడిస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ప్రభాకర్ రెడ్డి ఎవరికీ కీడు చేయని వ్యక్తి అని హరీశ్ రావు తెలిపారు. కత్తి లోపలికి ఎక్కువగా దిగకపోవడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రత్యర్థులు రాజకీయంగా ఎదుర్కోవాలని.. ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి హరీశ్ చెప్పారు. ఈ హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హరీశ్ రావు తెలిపారు.
ఆస్పత్రిలోకి పరుగుతీసిన మంత్రి హరీశ్ రావు : అంబులెన్స్‌లో ప్రభాకర్ రెడ్డిని ఆస్పత్రికి తీసుకురాగా.. మంత్రి హరీశ్ రావు తన కారులోంచి దిగి ఆస్పత్రిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు. ప్రభాకర్ రెడ్డికి వైద్యులు సిటీ స్కాన్ చేశారని చెప్పారు. కడుపులో రక్తస్రావం అయ్యిందని తెలిపారని చెప్పారు. సర్జరీ చేయాల్సి ఉండటంతో ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి కోసం హాస్పిటల్‌కు పరిగెత్తుకుంటూ వెళ్ళిన మంత్రి హరీష్ రావు. pic.twitter.com/XOFPxVWfcE
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2023
సర్జరీ అనంతరం వివరాలు మీడియాకు చెబుతామని హరీశ్ రావు తెలిపారు. ఆయన కోలుకుంటారని, కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి, పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు రాజు ఏ పార్టీకి చెందినవారనేది తెలియదన్నారు. ప్రభాకర్ రెడ్డి బాడీగార్డ్ అప్రమత్తమై దాడి సమయంలో రాజును నిలువరించడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందన్నారు. సీఎం కేసీఆర్ సాయంత్రం ఆస్పత్రికి వచ్చి ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తారని చెప్పారు.
నిందితుడు రాజుపై కేసు నమోదు : కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన నిందితుడు రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తుండగా.. గడ్డం రాజు అనే వ్యక్తి కలవడానికి వచ్చి కత్తితో పొడిచిట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు రాజు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు సీపీ ఎన్ శ్వేత తెలపారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications