త్వరలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు: బీజేపీ, కాంగ్రెస్ మాకు పోటీనా? మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 20వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉంటుందని పేర్కొన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. సభా వేదికగా సంక్షేమం, అభివృద్ధి పై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారని పేర్కొన్నారు.
Recommended Video


టీఆర్ఎస్ లో అసంతృప్తి లేదు
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఆమడ దూరం చేసి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి చెందాడని సెటైర్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి లేదని, ఆశావహులు మాత్రం భారీగా ఉన్నారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. గెలిచే పార్టీలో ఆశావహులు ఉండడం సహజం అంటూ ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి యధావిధిగా సాగుతుందని తెలిపిన ఆయన దేశ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ అసలు పోటీనే కాదు
మునుగోడు ఉప ఎన్నికల్లో తమకు కాంగ్రెస్, బిజెపి అసలు పోటీనే కాదని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. త్వరలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని, వలసలు కొనసాగుతాయని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. మునుగోడు లో టిఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజారిటీతో గెలవబోతున్నారు అని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగిరేది గులాబీ జెండానే అని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు టిఆర్ఎస్ లో అసంతృప్తులు లేరని అందరు ఐక్యంగా ఉన్నామని మంత్రి తెలిపారు.

నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ బారి నుండి కాపాడింది కేసీఆర్ నే
మునుగోడు ఉపఎన్నిక కారణమైన వారిని ప్రజలు ఎండగట్టాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బారినుండి కాపాడిన సీఎం కేసీఆర్ అని, ఫ్లోరోసిస్ అరికట్టడం కోసం మిషన్ భగీరథ తీసుకువచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి కితాబిచ్చారు. సొంత పార్టీపై మాట్లాడి సంచలన ప్రకటనలు చేయడం తప్ప రాజగోపాల్ రెడ్డి చేసిందేమీ లేదని, కేవలం రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం ప్రస్తుతం ఉప ఎన్నిక వస్తుందంటూ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

చేరికలు భారీగా ఉంటాయని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు..
సీఎం ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టిన గెలిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచే వరకు విశ్రమించేది లేదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి చేరికలు భారీగా ఉంటాయని చేసిన వ్యాఖ్యలతో టిఆర్ఎస్ పార్టీ చేరికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కోసం టిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు గా తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications