తెలంగాణ మంత్రి, ఎంపీని సరిహద్దులో అడ్డుకున్న కర్నాటక పోలీసులు

హైదరాబాద్/కరీంనగర్: కర్నాటక సరిహద్దులో తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపి జితేందర్ రెడ్డిని కర్నాటక పోలీసులు మంగళవారం నాడు అడ్డుకున్నారు. కర్నాటక రాష్ట్రంలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్లుగా తెలంగాణ గుర్తించిన విషయం తెలిసిందే.

వీటిని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కర్నాటక అక్రమ ప్రాజెక్టులు కడుతుందని నిర్ధారించుకున్న నేపథ్యంలో వాటిని పరిశీలించేందుకు మంత్రి జూపల్లి, ఎంపీ జితేందర్ రెడ్డి మంగళవారం వెళ్లారు.

గిరిజాపూర్ వద్ద కృష్ణా నది పైన నిర్మిస్తున్న ప్రాజెక్టు పరిశీలనకు మంత్రి, ఎంపీ బయల్దేరారు. అయితే రాయచూర్ జిల్లా శక్తినగర్ వద్ద వారిని కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటక ఉన్నతాధికారులతో జూపల్లి, జితేందర్ రెడ్డి చర్చిస్తున్నారు.

Minister Jupalli to visit Karnataka projects

కృష్ణా నది పైన మినీ బ్యారేజీ నిర్మాణంతో వరద నీటిని ఒడిసిపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన పనలు చేపడుతోంది. ఇది అక్రమమని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది.

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: బాల్క సుమన్

సింగరేణి కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకు వెళ్లి వాటిని పరిష్కరిస్తానని ఎంపీ బాల్క సుమన్ మంగళవారం అన్నారు. మెడికల్ అన్ ఫిట్‌ను సరళతరం చేసి, డిపెండెంట్ కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని సింగరేణి కార్మికులు సుమన్‌కు విజ్ఞప్తి చేశారు. గోదావరిఖనిలోని 5వ గనిలో సుమన్ కార్మికులతో మాట్లాడారు.

ఏబీవీపీ భిక్షాటన

ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు సిద్దిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

కాంగ్రెస్, టిడిపిలపై గణేష్ ఆగ్రహం

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామాలపై మాట్లాడే హక్కు టీడీపీ, కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే పల్లెలు భ్రష్టు పట్టిపోయాయన్నారు.

సంక్షేమ రంగంలో రాష్ట్రం దూసుకుపోతుంటే విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. టీడీపీ నేతలు ఇంకా ఆంధ్రోళ్లకు ఊడిగం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులను ఎందుకు మెచ్చుకోవడం లేదని ప్రశ్నించారు. రూ. 9.76 కోట్లు ఎర్రజొన్న బకాయిలు చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.

రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర గత పాలకులదన్నారు. త్వరలోనే రైతులకు నిరాంతరయంగా విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+