120 ఎకరాల్లో వెటర్నరీ కాలేజీ: కడియం, కాపలాదారున్ని మాత్రమే:ఈటెల
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్‌లో ఇచ్చిన హామీలను వచ్చే ఆరు నెలల్లో అమలు చేసేందుకు కృషిచేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మామునూరులో వెటర్నరీ కాలేజీకి ప్రభుత్వం 120 ఎకరాల స్థలం కేటాయంచినట్లు ఆయన వెల్లడించారు.
వరంగల్‌లోని పైడిపల్లిలోని ఏఆర్ఎస్‌లోనే వ్యవసాయ కాలేజీని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు సైనిక పాఠశాల, ఐదెకరాల్లో కాటన్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు 18 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు.
క్వాలిఫై అయిన వారికి స్పెషల్ డిఎస్సీ
1998, 2008, 2012 సంవత్సరాలలో డిఎస్సీ క్వాలిఫై అయిన వారికి మరోసారి ప్రత్యేక డిఎస్సీ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. వారంలో ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది. పై మూడు డిఎస్సీలలో కలిపి 6,097 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తమకు న్యాయం కావాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికే ప్రత్యేక డిఎస్సీ ఉండనుంది.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఈటెల రాజేందర్

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ హాలును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా చూపు బంజారాహిల్స్ వైపు కాదని, అడ్డగుట్టలోని గుడిసెలు, మురికి వాడలు, మూసీ నది వైపేనని ఆయన అన్నారు.
ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం ఉద్యోగులు పని చేయాలని చెప్పిన ఆయన ఆర్థిక శాఖ అన్ని శాఖలకు గుండెకాయ లాంటిదన్నారు. ప్రజల సొమ్ముకు తాను కాపలాదారున్ని మాత్రమే అని స్పష్టం చేశారు.
అక్రమాలు ఆరికట్టాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంది అని పేర్కొన్నారు. రీ ఓరియెంటెడ్, రీ ఇన్వెంటెడ్ తెలంగాణ కృషి చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications