ఒక్కొక్కరు 10ఓట్లు వేసి గెలిపించాలి.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల రచ్చ
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో గెలుపుపైనే దృష్టిపెట్టిన రాజకీయపార్టీలు ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఇక ఎన్నికలలో మళ్ళీ మెజార్టీ స్థానాలు సంపాదించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించాలని ప్రయత్నం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచార పర్వాన్ని జోరుగా సాగిస్తున్నారు.
మెదక్ లో కాంగ్రెస్ రోడ్ షో
ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్ని లోక్ సభ స్థానాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడం తో పాటు, ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక తాజాగా ఇదే క్రమంలో మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొండా సురేఖ వ్యాఖ్యలు
ఈ రోడ్ షోలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్ షో లో మాట్లాడిన కొండా సురేఖ బీసీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న బీసీలందరూ ఒక్కొక్కరు 10ఓట్లు వేస్తే మన నీలం మధు విజయం సాధిస్తారని వ్యాఖ్యలు చేశారు . ఒక్కొక్కరు 10ఓట్లు వేసి నీలం మధుని గెలిపించాలని కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
10 దొంగ ఓట్లు వేసైనా సరే గెలిపించండి!
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2024
ఒక్కొక్కరు 10 ఓట్లు వేసి నీలం మధును గెలిపించాలి - మంత్రి కొండా సురేఖ pic.twitter.com/6VIWMTJYo7
దొంగ ఓట్లు వేయమని కొండా సురేఖ చెప్తున్నారన్న ప్రత్యర్థి పార్టీలు
అయితే మంత్రి కొండా సురేఖ దొంగ ఓట్లు వేయమని బీసీలను ప్రోత్సహిస్తున్నారని, ఒక్కొక్కరు ఒక్క ఓటు మాత్రమే వేయగలరని, ఒక్కొక్కరిని 10 ఓట్లు వేయమన్నారు అని ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. దొంగ ఓట్లు వేయడానికి కొండా సురేఖ బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారని , 10 దొంగ ఓట్లు వేసి అయినా సరే గెలిపించాలని కోరుతున్నారని ప్రచారం చేస్తున్నారు.
బీసీలను ఉద్దేశించి కొండా సురేఖ వ్యాఖ్యల ఉద్దేశం ఇదే .. కాంగ్రెస్ క్లారిటీ
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం అది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కొండ సురేఖ బీసీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలలో ఒక్కొక్కరు పదిమందితో ఓట్లు వేయించాలి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో భాగంగా ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలని పొరబాటుగా అన్నారని, అంతేతప్ప సురేఖ వ్యాఖ్యల్లో మరే ఇతర ఉద్దేశం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమయంలో దుమారంగా మారాయి.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications