పిచ్చోడి చేతిలో పార్టీ: మంత్రి కేటీఆర్; పేపర్ల లీకేజీలో కుట్రకోణం: మంత్రి సబిత!!
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రులు బండి సంజయ్ ను రాష్ట్రంలో బీజేపీ నేతల తీరును టార్గెట్ చేస్తున్నారు. కేవలం రాష్ట్రంలో కుట్రలకు తెరతీశారని బీజేపీ నేతలపై మండిపడిన వారు ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాల వెనుక బీజేపీ ఉందన్నారు.
తాజాగా మంత్రి కేటీఆర్ బండి సంజయ్ అరెస్ట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాజాగా బండి సంజయ్ అరెస్టుపై ఓ వ్యక్తి చేసినటువంటి ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ లో పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చిపోయేటోళ్ళకి ప్రమాదం అంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ పిచ్చోడి చేతిలో ఏకంగా ఒక పార్టీనే ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ మంత్రి కేటీఆర్ బండి టార్గెట్ చేశారు. తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశ్నాపత్రాలను లీక్ చేసి అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపి నాయకులు అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువచ్చి వాటిని వైరల్ చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ వరకు కుట్రకోణం దాగుందని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు పర్యవేక్షణలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లీకేజీలకు తెరతీసారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు స్వార్థ రాజకీయాల కోసం ఐదు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా అంటూ మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో కీలకంగా ఉన్న రాజ శేఖర్ కు, పదవ తరగతి పరీక్షల పేపర్ లీకేజీలో కీలకంగా ఉన్న ప్రశాంత్ కు బిజెపి నేతలతో సంబంధాలు ఉన్నాయని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రశ్నాపత్రాన్ని లీకేజ్ కి కారణమైన టీచర్ కూడా బిజెపి అనుబంధ సంఘ సభ్యుడు అని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సబితా ఇంద్రా రెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications