కిషన్ రెడ్డి ఫోన్ ను ట్యాప్ చేస్తున్న ప్రధాని మోడీ: KTR
పెగాసస్ వ్యవహారం ఇటీవల మనదేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు నిందితులెవరో తెలియకుండానే ఈ వ్యవహారం సద్దుమణిగిపోయింది. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్‌ను ప్రధానమంత్రి మోడీ ట్యాప్ చేస్తున్నారని వెల్లడించారు. అయితే తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే విషయం మంత్రికి తెలియదని చెప్పారు. తన ఫోన్‌తోపాటు 10వేలమందికి పైగా ఫోన్లలో పెగాసస్ ఉందని, ఈ విషయాన్ని ఇప్పుడే ప్రకటిస్తున్నామని కేటీఆర్ చెప్పడం సంచలనాన్ని కలిగించింది.
గతేడాది పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం అనేకమంది ప్రముఖుల ఫోన్ ను ట్యాప్ చేస్తోందంటూ వచ్చిన వార్తలు ప్రకంపనలు రేకెత్తించాయి.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రతిపక్షం అధికార పార్టీపై ఆరోపణలు గుప్పించింది. దేశంలో మొత్తం 300మందికి పైగా ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ 'ది వైర్' వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్, టీఎంసీ అభిషేక్ బెనర్జీ, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తదితరుల పేర్లున్నాయని తెలిపింది.

అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టేసింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో పని చేసినవారు పెగాసస్ స్పైవేర్ ను తయారుచేశారు. దీని ఆధారంగా మనకు కావల్సిన వ్యక్తి ఫోన్ నుంచి డేటా తస్కరించడానికి అవకాశం ఉంటుంది. వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా లింక్ పంపించి అది క్లిక్ చేయగానే వారికి తెలియకుండానే సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ అవుతుంది. తర్వాత డేటాను పంపిస్తుంది.
ఆపిల్ సంస్థకు చెందిన i మెసేజ్ యాప్, పుష్ నోటిఫికేషన్ల సర్వీస్ ప్రోటోకాల్ ఆధారంగా ఐఫోన్లలోకి పెగాసస్ తన స్పైవేర్‌ను పంపడంతోపాటు అండ్రాయిడ్ ఫోన్లను కూడా లక్ష్యంగా ఎంచుకుంది. వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్‌లోని ఓ లోపం ఆధారంగా ఎన్‌ఎస్‌వో గ్రూప్ పెగాసస్‌ను ఫోన్లలోకి చొప్పిస్తోందని వాట్సాప్ ఆరోపణలు చేసింది. ఫోన్ ఉపయోగిస్తున్న వ్యక్తికి అటాకర్ వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు. ఫోన్ రింగ్ అవగానే మాల్షియస్ కోడ్ ఫోన్లోకి చేరడంతో కాల్‌ను ఎత్తకపోయినా స్పైవేర్ ఆ వ్యక్తి ఫోన్లోకి ప్రవేశిస్తుందని వాట్సాప్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications