'ఆ ఘనత కేసీఆర్‌దే, దేశంలోనే రోల్‌మోడల్‌గా టీఆర్‌ఎస్ ప్రభుత్వం'
హైదరాబాద్: దేశంలోనే రోల్ మోడల్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో ఈరోజు ఆర్టీఏ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐడీహెచ్ కాలనీలో 400లకు పైగా ఇళ్లను కట్టించి చూపించామన్నారు.
పేదల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. హైదరాబాద్‌లోని నిరుపేదలకు ఈ ఏడాది పదివేల ఇళ్లను కట్టించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
గత పాలకులు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఒక్క రిజర్వాయర్‌ను కట్టలేదని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్30 టీఎంసీలు సామర్ధ్యంతో రెండు రిజర్వాయర్లు కట్టాలని నిర్ణయించామన్నారు. మైనార్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మైనార్టీ పేద యువతులకు షాదీ ముబారక్ కింద రూ.51 వేలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఒక్క నిమిషం కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నామని చెప్పిన ఆయన స్మశానాలకోసం అన్ని మతాల వారికి ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తామన్నారు.
పాతబస్తీలోని నిరుపేదల అభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆర్టీఏ పరిధిలోని 24 సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications