రాహుల్, డీకే కు కేటీఆర్ ట్వీట్ - రేవంత్ కు ఇరకాటం..!!
తెలంగాణ ఎన్నికల రాజకీయం రంజుగా మారుతోంది. బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని తెలంగాణలో ఎన్నికల పైన నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ చేసింది. హ్యాట్రిక్ సాధించే లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుడుగు వేస్తోంది. మంత్రి కేటీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ లక్ష్యంగా రాహుల్ కు ట్వీట్ చేసారు. అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ప్రచారానికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికల వేళ మరోసారి ఓటు కు నోటు కేసు తెర మీదకు వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు బీఆర్ఎస్ ఈ అంశాన్ని ఎన్నికల సమయంలో ప్రస్తావన చేస్తోంది. గతంలో టీడీపీ నేతగా రేవంత్ ఉన్న సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగిన ఓటు కు నోటు కేసు పైన నాడు కాంగ్రెస్ సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన పత్రికల్లో వచ్చిన వార్తను జోడిస్తూ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రు టాగ్ చేస్తూ ట్వీట్ చేసారు. అందులో విచారణ గురించి ప్రశ్నించారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాము రాజకీయంగా కక్ష్య సాధింపుకు దిగి ఉంటే రేవంత్ ఊచలు లెక్కపెట్టేవాడని..రేపు ఏం జరుగుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు.

Kya @RahulGandhi Ji, Ho Jaye CBI enquiry? pic.twitter.com/LRIFaeDve8
— KTR (@KTRBRS) October 29, 2023
ఇక, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎన్నికల కసరత్తు మొదలు ప్రచారం వరకు డీకే పాత్ర కీలకంగా మారింది. ఇప్పుడు కర్ణాటకలో అమలు చేస్తున్న సంక్షేమం వివరిస్తూ తెలంగాణలో ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం డీకే కొనసాగిస్తున్నారు. కర్ణాటకకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపిస్తామన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు.
డీకే గారు...
— KTR (@KTRBRS) October 29, 2023
కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది.
దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి... కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది…
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందని చెప్పారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా అని ప్రశ్నించారు. అటు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుండగా.. ప్రచారంతో పాటుగా పార్టీ ఎన్నికల వ్యూహాలను కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం అన్ని నియోజకవర్గాల పరిశీలకులతో ప్రతీ రోజు సమీక్ష చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications