చంద్రబాబు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి - మంత్రి నిరంజన్ రెడ్డి..!!

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పై తెలంగాణ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించే వేళ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. టిడిపి వచ్చాకే తెలంగాణ ప్రజలకు వరి అన్నం తెలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించటం సరి కాదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. చరిత్ర తెలియని వారు ఈ ప్రాంత ముఖ్యమంత్రులుగా పనిచేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణలో పార్టీ ప్రస్థానం గురించి వివరించే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకుంటారని చంద్రబాబు అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోందని తెలిపారు. ఎన్టీఆర్‌ తెలంగాణ గడ్డపైనే టీడీపీను ఏర్పాటు చేశారన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని వెల్లడించారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రజలు బియ్యంతో అన్నం తింటున్నారంటే నాడు టీడీపీ తీసుకొచ్చిన కిలో రూ.2 బియ్యం పథకం వలనే అని చంద్రబాబు అనటం ఇప్పుడు తెలంగాణ మంత్రుల ఆగ్రహానికి కారణమవుతోంది. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ 11వ శతాబ్దం నాటికే వరి పండించిందని, హైదరాబాదు నగరం 15వ శతాబ్దం నాటికే దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందిందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

Minister Niranjan Reddy Demands Chandra Babus Apology, objects tdp chief Comments

చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుది అవగాహనరాహిత్యమే కాకుండా, అహంకారంతో కూడిన ధోరణి అని విమర్శించారు. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు నిర్మించారని... ఆ నీటిపారుదల కింద వరి, గోధుమలు, కొర్రలు, పెసలు, అల్లం, చెరుకు, ఉల్లి, జొన్నలు, పసుపు పంటలు పండించారని వివరించారు. అయితే, నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని తప్పు బట్టారు. నిరంజన్ రెడ్డి ఏరియా నుంచి ఇంకా వలసలు కొనసాగుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డితో తాను డిబేట్‭కు సిద్ధమని సవాల్ చేశారు . ఆహార భద్రత అనేది టీడీపీ వచ్చిన తరువాతే లభించిందనేని వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+