TGSRTC: రాష్ట్రంలో రెండు కొత్త బస్ డిపోలు..

ఆర్టీసీలో నూతన జవసత్వాలు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆర్టీసీలో పలు మార్పులు చేస్తోంది. అలాగే ఆర్టీసీలో త్వరలో నియామకాలు ఉంటాయని కూడా రవాణా శాఖ ప్రకటించింది. అంతే కాదు కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని క్రమంగా పెంచుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. ఇలా ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

తాజాగా రాష్ట్రంలో కొత్తగా రెండు ఆర్టీసీ బస్సు డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో ఒక్క కొత్త బస్సు డిపో కూడా ఏర్పాటు చేయలేదని పొన్నం గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీజీఎస్ ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
పదిహేనేళ్లలో నష్టాల్లో ఉన్న టీజీఎస్ ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్తామని చెప్పారు. కొత్తగా ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీలో సంస్కరణలతో అనేక కార్మిక సంక్షేమం, ప్రజల సౌకర్యం కొరకు పని చేస్తున్నట్లు తెలిపారు.

Minister Ponnam Prabhakar said that two new bus depots will be set up in Telangana

పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పెద్దపల్లిలో, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బస్సు డీపోలు ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం ఈ రెండు ఆర్టీసీ డిపోల ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు కొత్త డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తారని చెప్పారు. త్వరలోనే బస్ డిపోల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. టీజీఎస్ ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు భర్తీ చేస్తామని పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించారు.

ఇందులో 2000 డ్రైవర్‌ ఉద్యోగాలు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు ఉండగా.. డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) 114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84, డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్ 23, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) 11, మెడికల్ ఆఫీసర్ (జనరల్) 07, మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్ 07, అకౌంట్స్ ఆఫీసర్ 06 ఉన్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+