Runa Mafi: దీపావళి తర్వాత వారికి రుణ మాఫీ.. గుడ్ న్యూస్ చెప్పిన సీతక్క..!
కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో రుణ మాఫీ ఒకటి. అన్నదాతలకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్ట్ 15 లో రుణ మాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చెప్పినట్లుగానే మూడు దశల్లో రుణ మాఫీ చేశారు. మొదటి దఫాలో రూ.లక్ష వరకు రుణ మాఫీ చేయగా.. రెండో దశలో రూ.1.5 లక్షల వరకు మాఫీ చేశారు. ఇక మూడో దశలో రూ.2 లక్షల రుణ మాఫీ చేశారు. అయితే అందరికీ రుణ మాఫీ చేయలేదు.
దీనిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అందరికి రుణ మాఫీ చేయాలని బీజేపీ, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం టెక్నికల్ సమస్య, కుటుంబ నిర్ధారణ చేయాలని కాలం వెళ్లదీస్తుంది. దీంతో బీఆర్ఎస్ రుణ మాఫీ పూర్తి చేయాలని చలో ప్రజా భవన్ కు పిలుపునిచ్చింది. బీజేపీ రైతు హామీల సాధన దీక్ష చేసింది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అంతే కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెళ్లిన చోట రుణ మాఫీపై వారిని నిలదీస్తున్నారు. కొందరికి మాఫీ చేసి మరికొందరు మాఫీ చేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారు.

దీనికి తోడు రైతు భరోసా కూడా విడుదల చేయలేదు. దీంతో రైతుల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రుణ మాఫీపై తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడారు. దసరా లోగా అని చెప్పారు. దీపావళి లోగా అని చెప్పారు. ఇప్పుడు డిసెంబర్ లోగా అని చెబుతున్నారు. దీంతో రైతులు అయోమయోయంలో ఉన్నారు. రుణ మాఫీపై తాజాగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. దీపావళి తర్వాత మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేసిన ఆమె.. రెండు మూడు నెలల్లో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. మిగతా వారికి దీపావళి పండగ తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు. అయితే ఇదైనా పక్కానా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీపావళి తర్వాత అంటే ఎప్పుడు.. నవంబర్ లోగానా లేక డిసెంబర్ లోగానా అని నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications