టీ ఫైబర్, మీ సేవ యాప్ సేవలు ప్రారంభం
తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పించే టీ ఫైబర్ సేవలను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం ప్రారంభించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. టీ ఫైబర్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో ఆయన మాట్లాడారు. మీ సేవ మొబైల్ యాప్‌ను కూడా మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇందులో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చారు. రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. ADex HDFC బ్యాంక్ రైతు రుణాలను రెండు రోజుల్లోనే పొందేలా యాప్ తీసుకువచ్చామన్నారు.

మొబైల్‌లోనే మీ సేవ సర్వీసులు పొందేలా యాప్ రూప కల్పన చేశారు. మీ సేవలో మరో తొమ్మిది రకాల సర్వీసులను ప్రభుత్వం యాడ్ చేసినట్లు తెలిపారు. గ్యాప్ సర్టిఫికేట్.. సిటిజన్ నేమ్ చేంజ్ వంటి తొమ్మిది రకాల అంశాలను కొత్తగా అందుబాటులోకి తెచ్చామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇన్ని రోజులు ఫిజికల్‌గా వెళ్లి తీసుకునే అంశాను ఇక నుంచి మీ సేవ యాప్ నుంచే పొందే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు.
అన్ని విభాగాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి ముందుకు సాగించాలని పని చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. డ్రగ్స్ కట్టడికి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా మిత్రా యాప్ రూపొందించామని మంత్రి తెలిపారు. చిన్న, మధ్య తరగతి సంస్థలను ఎంకరేజ్ చేయాలని పదేళ్ల తర్వాత కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకువచ్చామని చెప్పారు.












Click it and Unblock the Notifications