ప్రధాని పదవి కోసం కాదు.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అందుకే: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని కావాలన్న ఉద్దేశంతో జాతీయ రాజకీయాల్లోకి రావడం లేదని, దేశ ప్రజలను చైతన్యవంతం చేయడానికి కెసిఆర్ వస్తున్నారంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఈ రోజు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని తాను తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

తెలంగాణా రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్ ను చులకనగా చూసినా రాష్ట్రం సాధించారు
కేంద్రంలో అధికారం కోసం బీజేపీ మతాన్ని వాడుకుంటూ, మత రాజకీయాలు చేస్తోందంటూ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కులమతాలను వాడుకుంటున్నానని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రాజకీయ లబ్ది పొందడం కోసమే వారీ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి నాయకుడే లేడని ఎద్దేవా చేసిన ఆయన ప్రత్యామ్నాయం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలామంది తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కెసిఆర్ ని చులకనగా చూశారని, అయినప్పటికీ కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి చూపించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.

దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే అందుకు కేసీఆర్ సమర్ధుడు
తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు అని అందరూ అనుకున్న సమయంలో రాష్ట్రాన్ని సాధించి చూపించిన కేసీఆర్ భవిష్యత్తులో కేంద్ర రాజకీయాల్లో విజయం సాధిస్తారు అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్ ను ఆదర్శంగా తీసుకొని దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే అందుకు కేసీఆరే సమర్ధుడు అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కితాబిచ్చారు. తెలివితేటలు, నైపుణ్యం ఉన్న కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, పోషిస్తారని తాను అనుకుంటున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

భారతదేశం అభివృద్ధి చెందాలంటే కెసిఆర్ వంటి సమర్ధుడైన నాయకుడు కావాలి
అంతేకాదు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో ముందుకు నడవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పేద వారి కోసం టిటిడి దేశవ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మించాలని, సహకారం అందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. అమెరికా తో సమానంగా చైనా అభివృద్ధి చెందిందని కానీ చైనా తో సమానంగా భారతదేశం అభివృద్ధిలో వెనుకబడిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే కెసిఆర్ వంటి సమర్ధుడైన నాయకుడు కావాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications