క్షమించండి: పొరపాటు జరిగిందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడియో

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్.. బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్ కుమార్ బాబును నెట్టేసిన ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ వర్గానికి చెందినవారు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం మారేడుపల్లిలోని ఆయన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జనం రద్దీ ఉన్న కార్యక్రమంలో అనుకోకుండా ఆయన బూటుతో తన కాలును తొక్కడంతో రక్తస్రావమైందని.. ఆ బాధలో ముందున్న వ్యక్తిని వెనక్కి లాగానని తెలిపారు.

minister Talasani Srinivas Yadav apologises for steel bridge opening ceremony incident

అతను గిరిజనుడైన బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసిందని, వెంటనే ఆయనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని క్షమాపణలు కూడా చెప్పానని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై అతనితోపాటు గిరిజన సమాజానికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో విషయం పెద్దది చేసి చూపుతున్నారని మంత్రి తలసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, దళిత బిడ్డలు, వెనకబడిన వర్గాలు, మైనార్టీల గొంతుకని అని తెలిపారు. ఈ సంఘటనపై తనతో ఎమ్మెల్సీ దండె విఠల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలచారి తదితరులు మాట్లాడారన్నారు. ఎటువంటి బేషజం లేకుండా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+