ఖబడ్దార్ బండి సంజయ్: హెచ్చరించిన వేముల ప్రశాంత్ రెడ్డి
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రపదజాలంతో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబమేనని పేర్కొన్న వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ పై ఆయన కుటుంబం పై ఎవరైనా నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, కేటీఆర్ చేసిన కృషి కూడా ప్రధాని నరేంద్రమోడీ చేయడం లేదని వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనంత అభివృద్ధి జరుగుతుంటే ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

బిజెపి వైఖరి వల్ల దేశ భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుందని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. దేశాన్ని దోచుకుంటుంది బీజేపీ అని, అసలు ఈడి కేసులు పెట్టాల్సిందే బిజెపి పైన అని వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతకుముందు బండి సంజయ్ తెలంగాణలో నయా నిజం గా మారిన కేసీఆర్ కు గోరి కట్టే రోజు దగ్గర పడిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించక ముందు ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీంతో కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications