సీఎం జగన్ అన్నకు ధన్యవాదాలు, అడగ్గానే - మంత్రి కేటీఆర్ ప్రశంసలు..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోతున్నా.. ప్రజలుగా కలిసే ఉందామని అప్పుడే చెప్పామని కేటీఆర్ గుర్తు చేసారు. దీనికి గొప్ప ఉదాహరణే... సుబ్బారెడ్డి అన్న ఇక్కడికి రావడమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలుగువారంతా కలసి ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అభివృద్ధి సాధించాలని అన్నారు.

టీటీడీ సహకారంతో: తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్లలో రూ 2 కోట్లతో పురాతన శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయానికి, ఎల్లారెడ్డి పేటలో రూ 2 కోట్లతో పురాతన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు మంత్రి కేటీఆర్..టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డితో కలసి భూమి పూజ చేశారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించారు.

KTR Special Thanks for AP CM JAgan

తమ వైపు నుంచి ఏపీ సీఎం జగన్ ను అన్నా.. తిరుమల తిరుపతి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేవాలయమని..ఏపీ ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులతో మీరు సీఎంగా ఉన్నారని..సుబ్బారెడ్డి అన్న టీటీడీ ఛైర్మన్ గా ఉన్నారు..మీరు కొంత డబ్బులు ఇస్తే ఇక్కడ పురాతన ఆలయాలు వెలుగొందుతాయని అడగ్గానే... సెకన్‌ కూడా ఆలోచించకుండా ఆమోదించారని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ కు ధన్యవాదాలు: జీర్ణోద్ధరణ పనులకు హాజరైన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి కేటీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలని తెలిపారు. పునర్నిర్మిస్తున్న వేణుగోపాల స్వామి ఆలయ ప్రభ తగ్గకుండా ఉండాలంటే మరో రూ.80 లక్షలు కావాలని సుబ్బారెడ్డి అన్నను అడగ్గానే... క్షణం కూడా ఆలోచించకుండా అంగీకరించారని కేటీఆర్‌ చెప్పారు.

ఇక... గంభీరరావుపేటలో సీతారామస్వామి దేవాలయ అభివృద్ధికీ డబ్బులు అడిగామని... తప్పకుండా ఆలోచిస్తామని సుబ్బారెడ్డి అన్న చెప్పారని మంత్రి కేటీఆర్ వివరించారు. సుబ్బారెడ్డి ఇక్కడికి రావటానికి ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమే కారణమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

టీటీడీ నిధుల మంజూరు: శ్రీవాణి ట్రస్ట్ కింద అనేక పురాతన ఆలయాల జీర్ణోద్దరణకు టీటీడీ నిధులు మంజూరు చేసిందని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి ప్రాంతాల్లో 2500కు పైగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

స్వామి వారి ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాలు సుఖ శాంతులతో వెలుగొందాలని ఆయన కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులు మంజూరు చేయించారని చెప్పిన మంత్రి కేటీఆర్ మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+