దారుణం: 2 రోజులపాటు మైనర్ బాలికపై 14 మంది గ్యాంగ్‌రేప్
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన 15 ఏళ్ళ బాలికపై 14 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలిని అడవుల్లోకి తీసుకెళ్ళి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు నిందితులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆనంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. కొన్ని కారణాలతో ఇటీవలనే స్కూల్ మానేసింది.
కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లితో కలిసి కూలి పనులకు వెళ్తోంది. అయితే పుట్టిన రోజున సందర్భంగా స్నేహితులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచేందుకు ఆ బాలిక షాపు వద్దకు వెళ్ళింది. నిందితులు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
జానంపేట పాండురంగాపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక చాక్లెట్లు, బిస్కట్లు కొనుక్కొనేందుకు షాపుకు వెళ్ళింది. షాపు వద్ద నుండి బాలికను ఆటోలో ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. జానంపేట అమరారం శివారులోని అడవుల్లోకి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిద్దరితో పాటు మరో నలుగురు కూడ వారికి జత కలిశారు. ఆరుగురు యువకులు ఆ బాలికపై అత్యాచారం చేశారు.

పుట్టినరోజునే రేప్‌కు గురైన బాలిక
పుట్టినరోజునే స్నేహితులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచేందకు షాపుకు వచ్చిన మైనర్ బాలికను నిందితులు కిడ్నాప్ చేశారు. 11వ పుట్టిన రోజు ఆ బాలికకు జీవితంలో చేదును మిగిల్చేలా చేశారు కిరాతకులు. సుమారు 14 మంది యువకులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు.

టూ వీలర్‌పై అడవిలోకి తీసుకెళ్ళి రేప్
అమరారం గ్రామంలో అత్యాచారం చేసిన తర్వాత ఆ బాలికను అదే గ్రామంలోకి ఓ ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ మరో నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుండి ద్విచక్రవాహనంపై దుగినేపల్లి పంచాయితీ శివారులోని అడవుల్లోకి తీసుకెళ్ళారు. అక్కడ మరో నలుగురు అత్యాచారం చేశారు.

బంధువుల ఇంటికి చేరిన బాలిక
అమరారం అడవుల్లో అత్యాచారం చేసిన తర్వాత ఆమెను అదే గ్రామంలోని ఓ ఇంట్లో ఉంచారు. మార్చి 12న ఉదయం ఐదు గంటలకు ఆ బాలికకు మెలకువ వచ్చింది. దీంతో ఆ బాలికను జానంపేట నుండి నేరుగా భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డిలోని బంధువుల ఇంటికి ఎలాగోలా చేరింది.

కూతురి ఆచూకీ కోసం
చాక్లెట్లు, బిస్కట్లు కొనుగోలు చేసేందుకు వెళ్ళిన బాలిక ఆచూకీ కోసం ఆ బాలిక తల్లిదండ్రులు బయ్యారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆ బాలిక బంధువుల సహయంతో ఇంటికి చేరింది. ఈ ఘటనపై బాలికను వివరాలను సేకరించనున్నట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications