దొంగతనం: అడ్డుకొందని పురుగుల మందు తాగించి చంపారు
చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో దొంగతనాన్ని అడ్డుకొన్నందుకు 16 ఏళ్ళ బాలికను బలవంతంగా పురుగుల మందు తాగించి చంపారు దుండగులు. ఈ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకొంది.
చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో దొంగతనాన్ని అడ్డుకొన్నందుకు 16 ఏళ్ళ బాలికను బలవంతంగా పురుగుల మందు తాగించి చంపారు దుండగులు. ఈ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకొంది.
చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో పట్టపగలే దుండగలు ఓ ఇంట్లోకి చొరబడి చోరికి యత్నించారు. దీన్ని అడ్డుకున్న అశ్విని(16)కి గుళికలు తాగించి సొమ్ముతో పరారయ్యారు. ఆబాలికను కుటుంబసభ్యులు మైరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది.

పాలమాకులు మల్లయ్య, పద్మ దంపతులకు కుమార్తె అశ్వినితోపాటు కుమారుడు కిరణ్ ఉన్నారు. అశ్విని స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉంది. తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా తమ్ముడు మిత్రులతో ఆడుకునేందుకు వెళ్లాడు.
ఈ క్రమంలో మధ్యాహ్నసమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా, సూట్‌కేస్‌ను పగులగొట్టి చోరికి యత్నిస్తుండగా అశ్విని ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహం చెందిన దుండగులు ఆశ్వినిని దారుణంగా హత్య చేశారు. వరి పొలంలో చల్లేందుకు తీసుకువచ్చిన గుళికల మందు ప్యాకెట్‌ను ఇంట్లో గుర్తించారు.
పురుగుల మందును నీటిలో కలిపి బాలికకు తాగించారు. ఆ తర్వాత ఇంటి ముందు, వెనుక తలుపులకు బయటనుంచి గొళ్లెం వేసి వెళ్లిపోయారు. ఇంటిలోపల నుండి
అరుపులు వస్తుండడంతో గొల్లెం తీసి లోనికి వెళ్లగా కిందపడి కొట్టకుంటూ కన్పించింది.
వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించగా ఇంటికి వచ్చిన వారు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చౌటుప్పల్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
అశ్విని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దొంగలు గుళికలు ఎందుకు తాగించారన్న వాదనలు వస్తున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications