Miss World India 2025: జస్ట్ మిస్.. మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్

72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పోటీలను తిలకించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెతో పాటు బాలీవుడ్ నుంచి మానుషీ చిల్లర్, ఇషాన్ కట్టర్ సందడి చేశారు.

మిస్ వరల్డ్ పోటీల్లో మొత్తం 108 దేశాలకు చెందిన అందగత్తెలు పోటీ పడ్డారు. అయితే ఆఖరి అంచె పోటీలకు పలు పోటీల్లో సత్తా చాటిన 40 మంది సుందరీమణులు ఎంపికయ్యారు. ఇక మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యారు. ఆమె మిస్ వరల్డ్ టాప్ 8లో నిలవలేక పోయింది. ఇక ఒక్కో ఖండం నుంచి 10 మంది ఫాస్ట్ ట్రాక్ విన్నర్‌లను మిస్‌ వరల్డ్‌ ఫైనల్ కు నిర్వాహకులు పరిచయం చేశారు.

ఇక ఈ ఫైనల్ పోటీలకు సోనూ సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లండ్ కరీనా జడ్జిలుగా ఉన్నారు. మిస్ వరల్డ్ జడ్జిల ప్యానెల్ హెడ్‌ గా మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లీ ఉన్నారు. ఇక మిస్‌ వరల్డ్‌ జడ్జిల ప్యానెల్ ‌లో రానా దగ్గుబాటి,జయేశ్‌ రంజన్‌ కూడా ఉండటం విశేషం. ఇక సోనూసూద్ కు మిస్ వరల్డ్ హుమానిటేరియన్ అవార్డు లభించింది. ఈ అవార్డును టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సోనూసూద్ కు అందించారు.

Miss India Nandini Gupta Out of Miss World Pageant

మీరు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారు..? అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు అభ్యర్థుల సమాధానాలకు న్యాయనిర్ణేతలు మార్కులు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+