రామప్ప ఆలయంలో శిల్పాలు చూసి మైమరిచిన మిస్ ఇండియా నందిని

యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామప్ప దేవాలయాన్ని 2023 మిస్ ఇండియా విజేత నందిని గుప్తా శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. నందిని గుప్తా రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు.

పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ నేతృత్వంలో టూరిజం గైడ్లు ఆమెకు రామప్ప ఆలయ చరిత్ర, రామప్పలోని మదనిక సాలబంజికల చరిత్రను తెలియజేశారు. అద్భుత నిర్మాణ రీతులు, అపురూప శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం జగద్విఖ్యాతం, కాకతీయుల నిర్మాణాల్లో తలమానికంగా నిలిచిన విషయం తెలిసిందే. రాళ్లను కరిగించి పోతపోసి మలిచిన శిల్పాలను నందిని గుప్తా ఆసక్తిగా తిలకించారు.

Miss India Nandini Gupta visits Ramappa Temple

మరోవైపు, మిస్​ వరల్డ్​ 2025 పోటీలకు అతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్​ నగరం సిద్ధమవుతోంది.మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరనుండగా ఈ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల అందాల భామలు రాష్ట్రంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూపేలా ప్రభుత్వం కార్యాచరణ చేసింది. అందులో భాగంగా మే 14న సుందరీమణులు రామప్పకు రానున్నారు. కానీ అంతకంటే ముందుగానే రాజస్థాన్‌కు చెందిన మిస్ఇండియా రామప్పను సందర్శించారు.

అంతకుముందు, నందిని గుప్తా చార్మినార్ సహా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. రాజస్థాన్‌​లోని కోటకు చెందిన నందిని ఇటీవల చార్మినార్​‌ను సందర్శించారు. అక్కడే ఉన్న లాడ్​‌ బజార్​‌లో గాజులు కొనుగోలు చేశారు. అనంతరం నందిని గుప్తా మీడియాతో మాట్లాడారు.

భారత్​ తరఫున పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు ఫెమినా మిస్​ ఇండియా వరల్డ్​ 2023 విజేత నందిని గుప్తా. సంప్రదాయ మూలాలతోపాటు ఆధునికత సంతరించుకున్న నగరం హైదరాబాద్ అని కొనియాడారు. ఐటీలో చాలా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇక్కడి సంస్కృతి, వారసత్వం, సాంకేతికను ప్రపంచం చూస్తుందన్నారు. పేర్కొన్నారు.

హైదరాబాద్​ నగరం అతిథ్యం నచ్చిందని తెలిపారు. ఇక్కడి ఆహారం, భాష, సంస్కృతిలో వైవిధ్యం తనను కట్టిపడేశాయని నందిని గుప్తా చెప్పారు. ప్రేమను సంచే నగరం ఇదని అన్నారు. విదేశీ ప్రతినిధులకు మనదేశ సంప్రదాయాలు, సంస్కృతులు పరిచయం అవుతాయన్నారు. అతిథులు పోచంపల్లి, కళాంకారి, గద్వాల చీరలు కట్టుకుని ఆలయాలను సందర్శిస్తారని ఆశిస్తున్నన్నట్లు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+