ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం: విశాఖ బీచ్‌లో శవమై తేలాడు
హైదరాబాద్/విశాఖపట్నం: హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి కార్తీక్(21) మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. కన్నవారికి తీరని శోకాన్ని మిగుల్చుతూ విశాఖపట్నం సముద్రంలో బలవన్మరణానికి పాల్మడ్డాడు కార్తీక్. తమ కొడుకు క్షేమంగా దొరుకుతాడని ఎంతో ఆశగా విశాఖపట్నం చేరుకున్న తల్లిదండ్రులు.. కార్తీక్ శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పర్స్, చెప్పులు అన్ని ఒడ్డున పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డ కార్తీక్ నాయక్ మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు పోలీసులు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఐఐటీ హైదరాబాద్‌లో ఉన్నత చదువుల కోసం చేరిన కార్తీక్.. ఎనిమిదిల రోజుల క్రితం అంటే జులై 17న కాలేజీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన రైతు, చిరు వ్యాపారి అయిన ఉమ్లా నాయక్ కుమారుడు కార్తీక్ ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. జులై 17న క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. ఆరోజు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, ఆ తర్వాత ఫోన్ స్విఛాఫ్ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
జులై 19వ తేదీ కూడా ఫోన్ స్విఛాఫ్ రావడంతో హాస్టల్ వార్డెన్ గోపీనాథ్‌కు విషయం చెప్పారు. క్యాంపస్‌లో కనబడటం లేదని చెప్పడంతో నేరుగా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఐఐటీ క్యాంపస్‌కు వెళ్లారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, వార్డెన్ జులై 19న సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా కార్తీక్ ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేశారు పోలీసులు.
కార్తీక్ మొదట సంగారెడ్డి నుంచి లింగంపల్లికి చేరుకుని ఎంఎంటీఎస్ ట్రైన్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. ఆ తర్వాత జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కార్తీకి తల్లిదండ్రులతో కలిసి ఒక హెడ్ కానిస్టేబుల్ సంగారెడ్డి నుంచి విశాఖపట్నం వెళ్లారు. స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చేపట్టారు.
కార్తీక్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మొదట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బేకరీ షాపులో కొన్ని తిండి పదార్థాలు తీసుకున్నట్లు గుర్తించారు. తన తండ్రి బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ వాడుతూ అవసరమైన చోట డబ్బులు చెల్లించాడు కార్తీక్. దీంతో తండ్రికి ఇందుకు సంబంధించిన సందేశాలు వస్తున్నాయి. వెంట వెంటనే కార్తీక్ వెళ్లిన ప్రాంతాలకు వెళ్లి చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. వీరు వెళ్లేసరికి కార్తీక్ అక్కడ్నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఇలా నాలుగురోజులపాటు విశాఖపట్నంలో కార్తీక్ కోసం గాలించారు.
చివరకు విశాఖపట్నం బీచ్‌లో శవమై తేలాడు కార్తీక్. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, కార్తీక్ బలవన్మరణానికి అతడి బీటెక్ మొదటి సంవత్సరం బ్యాక్‌లాగ్స్ కారణమని ప్రాథమికంగా తేలింది. తోటి విద్యార్థులు, తల్లిదండ్రులకు తన బ్యాక్‌లాగ్స్ గురించి పలుమార్లు కార్తీక్ బాధపడినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే ఒత్తిడిని తట్టుకోలేక విశాఖకు వచ్చి కార్తీక్ బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. సరైన కౌన్సిలింగ్ లభించివుంటే కార్తీక్ ఈ నిర్ణయం తీసుకునేవాడు కాకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. కార్తీక్ తన నిర్ణయంతో.. కని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం -
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications