కవితమ్మ తెలంగాణా బతుకమ్మ.. ఆమె జోలికొస్తే జరిగేదిదే: పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి శాపాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బిజెపి ఎంపీలు చేసిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం లో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ కవిత పాత్ర ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాదు బీజేవైఎం కార్యకర్తలు కవిత ఇంటిని ముట్టడించి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఇక తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బిజెపి పిలుపునివ్వడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలను, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

కవిత ఇంటిపై దాడిని ఖండించిన పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

కవిత ఇంటిపై దాడిని ఖండించిన పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా బీజేపీ నాయకులపై మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ కవితను ఈ స్కామ్ లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్రంలోని బిజెపి సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా పియూసి చైర్మన్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ బతుకమ్మ అని, బతుకమ్మ జోలికి వస్తే బతుకు బుగ్గిపాలు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. కవిత ఇంటిపై బిజెపి కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణాలో బీజేపీ రౌడీయిజం, ఈడీయిజం నడవవు

తెలంగాణాలో బీజేపీ రౌడీయిజం, ఈడీయిజం నడవవు


బిజెపి రౌడీయిజం, మోడీ ఈడీయిజం తెలంగాణ రాష్ట్రంలో నడవవని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కవితకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్న ఆయన కవిత పై ఆరోపణలు చేసిన వారిపై లుకౌట్ నోటీసులు ఉన్నాయని, అలాంటి వారు కవితపై వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రత్యర్థులను వేధించటం కోసం బీజేపీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి, ఒకవేళ కేసు ఉంటే సదరు దర్యాప్తు సంస్థలు చెబుతాయా లేక బీజేపీ నేతలు చెబుతారా అంటూ మండిపడ్డారు. కవిత జోలికొస్తే యావత్ తెలంగాణ కన్నెర్రజేస్తుందని పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు.

కవితపై బీజేపీ నిరాధార ఆరోపణలు; మేం దాడులు చేస్తే ఉంటారా? టీఆర్ఎస్ నేతల ఆగ్రహం

కవితపై బీజేపీ నిరాధార ఆరోపణలు; మేం దాడులు చేస్తే ఉంటారా? టీఆర్ఎస్ నేతల ఆగ్రహం


ఇదిలా ఉంటే కవిత పై బీజేపీ నిరాధార ఆరోపణలు చేసిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. కేంద్రాన్ని సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలోనే, బిజెపి మోసాలను అన్నిచోట్లా ప్రశ్నిస్తున్న కారణంగానే బీజేపీ ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నదంటూ బాల్క సుమన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక బీజేపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు . తప్పుడు కేసులకు, కాసులకు టిఆర్ఎస్ పార్టీ లొంగిపోదని స్పష్టం చేశారు. కెసిఆర్ రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పేర్కొన్న బాల్క సుమన్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ బెబ్బులి అంటూ పేర్కొన్నారు. ఇక మేం తిరిగి దాడులు చేస్తే ఉంటారా అంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. కవితకు సంఘీభావంగా తెలంగాణా మంత్రులు, నేతలు బీజేపీని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+