రేవంత్ కు పోటీగా బీజేపీ - ఆపరేషన్ బీఆర్ఎస్, లిస్టులో..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ను ఆకర్షించే ప్రయత్నాలను కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లో చేరగా..మరి కొందరు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేస్తోంది. తాజాగా ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీతో సుదీర్ఘ మంతనాలు..వరుస చర్చలతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
బీజేపీ కొత్త గేమ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై బీజేపీ గురి పెట్టింది. ఇటీవల ఈడీ దాడులు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. మహిపాల్‌రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జహీరాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు బీబీ పాటిల్‌తో మహిపాల్‌రెడ్డి సమావేశం కావడం కూడా ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అయితే గతంలో బీఆర్‌ఎస్ తరఫున రెండుసార్లు జహీరాబాద్ ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్‌తో మహిపాల్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

బీజేపీ ఎంపీతో భేటీ
తాజా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునంధన్‌రావు పటాన్‌చెరు నియోజకవర్గంలో లక్ష పైచిలుకు ఓట్లు సాధించడంతో.. ఓటుబ్యాంకు బీజేపీ వైపు మళ్లిందన్న సంకేతాలు కనిపించాయి. బీఆర్‌ఎస్ ఏకంగా మూడో స్థానానికి పడిపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న స్థానిక బీఆర్‌ఎస్ నేతల మెదళ్లను తొలుస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే ఫలితాలు వస్తే కేడర్ మిగలదన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తొలుత కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా.. ఈడీ సోదాల తరువాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.
చేరికలు ఉంటాయా
పటాన్‌చెరు నియోజకవర్గంలో తన ప్రధాన అనుచరులుగా చెప్పుకొనే వారికి సైతం చెప్పకుండా ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేవలం కేసు పనిమీద న్యాయవాదులను కలిసేందుకు వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నా.. బీజేపీ నేత బీబీ పాటిల్‌తో మంతనాలకు సంబంధించి మాత్రం సమాధానం కరువైంది. అంతేకాకుండా బీజేపీ సంగారెడ్డి జిల్లా ముఖ్యనాయకుడు సైతం ఎమ్మెల్యే వెంట వెళ్లడం అనుమానాలు మరింత బలపడేలా చేస్తోంది. మహిపాల్ తొలుత కాంగ్రెస్ లో చేరేందుకే ప్రయత్నాలు చేశారని, కానీ.. ఆయన ప్రయత్నాలను స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారని సమాచారం. దీంతో, మహిపాల్ పార్టీ మార్పు పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టతరావల్సి ఉంది.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
KCR మాస్ వార్నింగ్! డీలిమిటేషన్ పై కేంద్రానికి స్ట్రాంగ్ మెసేజ్ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!!












Click it and Unblock the Notifications