రాజాసింగ్ చేరే పార్టీ, బాధ్యతలు ఖరారు - అక్కడే ట్విస్ట్..!?
బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేసారు. తన రాజీనామా పైన బీజేపీ నాయకత్వం స్పందన ఏంటో తెలిసిన తరు వాత తన నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. అటు బీజేపీ హైకమాండ్ ఇప్పటికే రాజాసింగ్ పైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రాజాసింగ్ తాను హిందూత్వం కోసం పోరాటం చేస్తా నని ప్రకటించారు. ఇందు కోసం మరో వేదిక ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తో తుది నిర్ణయం జరిగిన తరువాత.. మరో పార్టీ.. తన బాధ్యతల పైన రాజాసింగ్ నిర్ణయం తీసుకోనున్నారు.
మూడు సార్లు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసారు. కొంత కాలంగా పార్టీ నేతల తీరు పైన రాజాసింగ్ ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ నిర్ణయాలను ఓపెన్ గానే వ్యతిరేకించారు. బహిరంగ వ్యాఖ్యలు చేసారు. తాజాగా బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక వేళ నామినేషన్ వేసేందుకు తాను రాగా.. తన మద్దతు దారులను బెదిరించి నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకున్నారని రాజాసింగ్ ఆరోపించారు. పార్టీ కార్యాలయం నుంచి తన రాజీనామా ప్రకటన చేసారు. కాగా, పార్టీ నేతలు మాత్రం రాజాసింగ్ పార్టీకి మాత్రమే రాజీనామా చేసి.. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని అంతర్గత చర్చల్లో ప్రశ్నలు వేస్తున్నారు. రాజాసింగ్ రాజీనామాను పార్టీ లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటు రాజాసింగ్ మాత్రం తనకు బీజేపీలో ఇష్టమైన నాయకులు నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా అలాగే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ అని చెప్పుకొచ్చారు. తన రాజీనామా పైన పార్టీ స్పందన చూసిన తరువాత తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. ఇటు రాజాసింగ్ ఇప్పటి కే శివసేన నాయకత్వంతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.
బీజేపీ నాయకత్వం తన రాజీ నామా విషయంలో చర్చిస్తే రాజీకి రాజాసింగ్ సిద్దం ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటి చర్చకు అవకాశం లేకుంటే శివసేన బాధ్యతలు తీసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు ఆయన మద్దతు దారుల సమాచారం. పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికే రాష్ట్ర నేతలు సమాచారం ఇచ్చారు. డిల్లీ నేతల స్పందనకు అనుగుణంగా రాజాసింగ్ భవిష్యత్ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications