వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో తీన్మార్ మల్లన్న ; ఇంట్లో పరిస్థితి చూసి షాక్ అయిన సీతక్క ; మల్లన్న బిడ్డను చూసి భావోద్వేగం !!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ సర్కార్ పాలనపై, కెసిఆర్ కుటుంబ అవినీతిపై ఓ యూట్యూబ్ న్యూస్ ఛానల్ తో టార్గెట్ చేస్తూ, సీఎం కేసీఆర్ కు చెమటలు పట్టిస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్ శర్మ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు మల్లన్నకు నోటీసులు ఇచ్చి విచారణ చేసిన పోలీసులు, అర్థరాత్రి సమయంలో పెద్ద హైడ్రామా మధ్య తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ కోర్టు ముందు హాజరు పరిచిన మల్లన్నకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

#YSR :మరపురాని మహానేత YSR గారి 12వ వర్థంతి సందర్భంగా ఘననివాళులు, ప్రముఖులతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి (ఫొటోస్)

తీన్మార్ మల్లన్న ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే సీతక్క

తీన్మార్ మల్లన్న ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే సీతక్క


తీన్మార్ మల్లన్న అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను విడుదల చేయాలంటూ ఆయన అనుచరుల, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యకర్తల నుండి డిమాండ్ వినిపిస్తోంది. తీన్మార్ మల్లన్న అరెస్టైన నేపథ్యంలో తాజా పరిణామాలతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క తీన్మార్ మల్లన్న కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పార్టీలకు అతీతంగా తాను మంచి అనుకున్నది చేసి తీరే కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ నివాసాన్ని సందర్శించారు. కూర్చోలేని, నడవలేని స్థితిలో ఉన్న మల్లన్న మూడేళ్ల కూతురు పరిస్థితి చూసి ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగానికి గురయ్యారు.

తీన్మార్ మల్లన్న మూడేళ్ళ కూతురి పరిస్థితి చూసి భావోద్వేగానికి గురైన సీతక్క

తీన్మార్ మల్లన్న మూడేళ్ళ కూతురి పరిస్థితి చూసి భావోద్వేగానికి గురైన సీతక్క

అనారోగ్య కారణాలతో కూర్చోలేకపోతున్న తీన్మార్ మల్లన్న మూడేళ్ల కూతురు పరిస్థితిని చూసిన సీతక్క ఆవేదన చెందారు. సీతక్కను చూసిన మల్లన్న కుటుంబ సభ్యులు తమ కుటుంబ పరిస్థితిని చెప్పి, మల్లన్న అరెస్టుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మల్లన్నను ఎలా అదుపులోకి తీసుకున్నారో సీతక్కకు వివరించారు. మల్లన్నను కలిసేందుకు పోలీసులు అనుమతించడం లేదని, ఫోన్ కాల్‌లో కూడా మాట్లాడటానికి అనుమతించలేదని వారు చెప్పారు. తీన్మార్ మల్లన్న తల్లి తన కొడుకు అరెస్ట్ గురించి సీతక్కకు చెప్పి కన్నీటిపర్యంతమయ్యారు.

ఇంట్లో బాధలు ఉన్నా జనం కోసం కేసీఆర్ తో కొట్లాడుతున్న మల్లన్న .. సీతక్క చెప్పిందిదే

ఇంట్లో బాధలు ఉన్నా జనం కోసం కేసీఆర్ తో కొట్లాడుతున్న మల్లన్న .. సీతక్క చెప్పిందిదే


సీతక్క మల్లన్న ఇంట్లో పరిస్థితి చూసి,బాధలు ఎదుర్కొంటున్నప్పటికీ తీన్మార్ మల్లన్న ప్రజల కోసం పోరాడుతున్నాడని చెప్పారు. మల్లన్న ఇంట్లో ఎన్నో బాధలు పెట్టుకొని జనం కోసం కేసీఆర్ తో కొట్లాడుతున్నాడు అంటూ పేర్కొన్న సీతక్క, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా చేయొచ్చు అనుకుంటే చెల్లదంటూ కేసీఆర్ ను, తెలంగాణా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పకుండా తప్పు చేయని వాళ్ళు అజేయులుగా బయటకు వస్తారని, తీన్మార్ మల్లన్న కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆమె వారికి సూచించారు.

తీన్మార్ మల్లన్న ను వర్చువల్ గా విచారించిన జగద్గిరి గుట్ట పోలీసులు

తీన్మార్ మల్లన్న ను వర్చువల్ గా విచారించిన జగద్గిరి గుట్ట పోలీసులు

ఇదిలా ఉంటే తీన్మార్ మల్లన్నను నిన్న జగద్గిరిగుట్ట పోలీసులు వర్చువల్ గా విచారించారు. తన ఫోన్ నెంబర్ ను మల్లన్న మీడియాలో స్క్రీన్ పై ప్రదర్శించారని జగద్గిరిగుట్ట కు చెందిన సంపత్ అనే వ్యక్తి గతంలో చేసిన ఫిర్యాదు మేరకు మల్లన్న పై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మల్లన్న పై గతంలో అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతోపాటు, ఇటీవల లక్ష్మీకాంత శర్మ తనను తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పీటీ వారెంట్ పై తీన్మార్ మల్లన్న పోలీసులు వర్చువల్ గా విచారించారు.

కేసీఆర్ కుటుంబ అవినీతిపై తీన్మార్ మల్లన్న సమరశంఖం


చాలా కాలంగా కేసీఆర్ కుటుంబ అవినీతిపై సమర శంఖం పూరించిన తీన్మార్ మల్లన్నను అనేకరకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ కు బలమైన పోటీ ఇచ్చారు. ఇక తాజాగా బ్లాక్ మెయిల్ చేశారని జైలుకు పంపించారు. ప్రభుత్వం ఎంతగా తీన్మార్ మల్లన్నను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నా మల్లన్న మాత్రం తనదైన శైలిలో కేసీఆర్ పాలనపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇక ఇదే సమయంలో అక్రమ కేసులు పెట్టి తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేశారని, ఆయనను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 14 బీసీ సంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి .

తీన్మార్ మల్లన్న ను రిలీజ్ చెయ్యాలని బీసీ సంఘాల డిమాండ్ .. ఈ వ్యవహారం ఏమవుతుందో ?


దశాబ్దకాలంగా తీన్మార్ మల్లన్న ప్రభుత్వ అధికారులు, మంత్రులు చేస్తున్న అక్రమాలను వెలికి తీసి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న పై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని బీసీ సంఘర్షణ సమితి ఆరోపిస్తోంది. తీన్మార్ మల్లన్న వెలికితీసిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వందల కోట్ల కుంభకోణాలపై, విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాల్సింది పోయి, ప్రభుత్వ ,మంత్రుల అవినీతి ని వెలికితీసేందుకు తీన్మార్ మల్లన్న పై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ, అక్రమ కేసులు పెడితే వేధిస్తోందని బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణం తీన్మార్ మల్లన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తీన్మార్ మల్లన్న కోసం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఉద్యమమే నడుస్తుంది. మల్లన్నను రిలీజ్ చెయ్యాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరి రాష్ట్రంలో సంచలనంగా మారిన మల్లన్న వివాదం చివరకు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి

English summary
Congress leader, Mulugu MLA Seethakka visited the house of Teenmar Mallanna, who was recently arrested in a extortion case and remanded in Chanchalguda jail. Mallanna's three-year-old daughter, who is unable to sit or walk condition, seethakka got emotional. Seethakka said that Mallanna is fighting with KCR for the people even he is facing many difficulties and problems at home. Seethakka told their family to be brave.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X