'అందుకే తలసాని రెచ్చిపోతున్నారు, కేసీఆర్‌ను తిట్టావ్ గుర్తుందా'

హైదరాబాద్: కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకే తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన రెచ్చిపోతున్నారని ఎమ్మెల్యే వివేక్ గురువారం మండిపడ్డారు.

చంద్రబాబును తిట్టే నైతిక హక్కు తలసానికి లేదన్నారు. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ఆయన అలా మాట్లాడాతున్నారన్నారు. తలసానికి దమ్ముంటే సనత్ నగర్‌లో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. మోండా మార్కెట్లో దళారి మాటలు తలసానివి అని ధ్వజమెత్తారు.

పార్టీలు మారిన వారే తమ పైన విమర్శలు చేస్తున్నారని రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి గీత, ఎస్పీవై రెడ్డిలు టీడీపీ సభ్యత్వం తీసుకోలేదని, వారికి తమ పార్టీలో పదవులు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.

MLA Vivek lashes out at Talasni

తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ కార్యాలయంలో కూర్చొని కేసీఆర్‌ను తిట్టారని చెప్పారు. అదే తలసాని ఇప్పుడు చంద్రబాబును హైదరాబాదులో తిరగనివ్వమంటూ హెచ్చరికలు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

బొండా ఉమ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల పోన్లు ట్యాప్ అయినట్లుగా అనుమానం ఉందన్నారు. తెరాస నాయకులు బంగారు తెలంగాణను బెదిరింపుల తెలంగాణగా మార్చేశారని ధ్వజమెత్తారు. అధికారం చేతిలో ఉందని గవర్నర్‌ను కూడా బెదిరిస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+