ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దం..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పై చర్యల దిశగా సుప్రీం చేసిన సూచనలతో స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వాటికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సమాధానాలు పంపారు. కాగా, పార్టీ మారిన వారి పైన చర్యల కోసం బీఆర్ఎస్ నేతలు తమ వద్ద ఉన్న ఆధారాలతో అసెంబ్లీ అధికారులను కలిసారు. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ కు సమాధానం ఇవ్వలేదు. న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్నారు. ఈ ఇద్దరు అవసరమైతే రాజీనామాకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు చేరువైన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ నిర్దేశిస్తూ అసెంబ్లీ కార్యదర్శికి సూచనలు చేసింది. ఫలితంగా స్పీకర్ ఈ పది మందికి నోటీసులు జారీ చేసారు. వీరిలో ఎనిమిది మంది తిరిగి సమాధానం ఇచ్చారు. కాగా, అందులో ఆరుగురికి సంబంధించి స్పీకర్ మరో సారి స్పష్టత కోరుతూ తాజాగా నోటీసులు పంపారు. ఇక.. ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ కు సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ ఇద్దరి విషయంలో న్యాయ నిపుణుల సూచనల మేరకు నడుచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్, తన కుమార్తె కోసం కాంగ్రెస్ కు అనుకూల ప్రచారం చేసిన కడియం శ్రీహరి ఇప్పుడు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. న్యాయ నిపుణుల సూచన మేరకు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలని డిసైడ్ అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దానం నాగేందర్ ఒక దశలో తన పదవికి రాజీనామా చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.
అయితే, అందుకు సీఎం రేవంత్ అంగీకరించలేదు. మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో వారిచ్చిన సమాధానాలతో స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, దానం.. కడియం విషయంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో.. ఈ ఇద్దరు రాజీనామా తప్పదనే వాదన వినిపిస్తోంది. దీంతో.. ఈ ఇద్దరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications