కాంగ్రెస్ గూటికి కవిత - హైకమాండ్ చర్చలు, తేల్చి చెప్పిన రేవంత్..!?

తెలంగాణ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. తన లేఖ ద్వారా సంచలనంగా మారిన కవిత రాజకీయంగా సంచలన నిర్ణయానికి సిద్దం అవుతున్నారు. ఇప్పటికే తాజా పరిణామాల పైన పార్టీ ముఖ్య నేతలతో పాటుగా కేసీఆర్ ఫోన్ ద్వారా కవితతో సంప్రదింపులు చేసారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఏంటో తేల్చాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. స్పష్టత లేకపోవటంతో కాంగ్రెస్ తో కవి మధ్యవర్తుల ద్వారా రాయబారం చేసినట్లు సమాచారం. హైకమాండ్ ఇదే అంశం పైన రేవంత్ తో చర్చించింది. రేవంత్ తన అభిప్రాయం స్పష్ట చేయటంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది.

కాంగ్రెస్ లోకి కవిత
ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా సంచలన నిర్ణయానికి సిద్దం అవుతున్నారు. కవిత లేఖ కలకలం తో బీఆర్ఎస్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా కవితతో కేసీఆర్ దూతగా పార్టీ ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ సైతం ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కవిత పైన పార్టీ నేత లు ఎవరూ ఘాటు వ్యాఖ్యలు చేయవద్దని కేసీఆర్ సూచించారు. అటు కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. కాగా, కవిత ఒక ముఖ్య నేత ద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు రాయబారం చేసినట్లు విశ్వస నీయ సమాచారం. కవిత కాంగ్రెస్ లోకి వచ్చేందుకు చేసిన ప్రతిపాదన పైన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సీఎం రేవంత్ .. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రేవంత్ తన అభిప్రాయం ఏంటో హైకమాండ్ ముందు తేల్చి చెప్పినట్లు పార్టీ నేతల సమాచారం.

mlc-kaivtha-disucssions-with-delhi-leaders-to-join-in-congress-as-reports

కవిత చేరితే
కవిత ఇటు లేఖ తరువాత వరుసగా తన మద్దతు దారులతో మంత్రాంగా సాగిస్తున్నారు. అటు ఢిల్లీ లో కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కవిత కాంగ్రెస్ లోకి వచ్చే ప్రతిపాదన పైన తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. టీపీసీసీ చీఫ్ దృష్టికి పార్టీ హైకమాండ్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రా యపడినట్లు సమాచారం. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్‌ కుటుంబ కలహాలకు కాంగ్రెస్‌ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళతాయనే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అభిప్రాయంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఏకీభవించింది. ఫలితంగా కాంగ్రెస్ లోకి ఇప్పటికిప్పుడు కవితకు ఎంట్రీ లేదనేది స్పష్టం అవుతోంది. దీంతో, కవిత జూన్ 2న కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.

కీలక నిర్ణయం
కాంగ్రెస్ తో రాయబారం దాదాపు విఫలమైంది. దీంతో, కవిత తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. సొంత బలం పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు. తొలుత, గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించారు. 'సింగరేణి జాగృతి' పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. అదే విధంగా తాను సొంతంగా ఎదిగే క్రమంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులు.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌తో సమావేశమవ్వడం, అనుబంధ సంఘాలను ప్రకటించడం, వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో.. కవిత జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+