వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారనే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై కవిత తేల్చేశారుగా!!

|
Google Oneindia TeluguNews

దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ సెగ తెలంగాణ రాష్ట్రానికి తాకింది. లిక్కర్ మాఫియాలో తెలంగాణ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని, కెసిఆర్ కుమార్తె కవిత ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్లో లిక్కర్ సెటిల్మెంట్లు జరిగాయని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ చేసిన ఆరోపణలతో ఒకసారిగా లిక్కర్ చిక్కుల్లో కవిత చిక్కుకున్నట్లు అయింది.

ఈ చర్యతో ప్రతీపౌరుడి వెన్నులో వణుకు; జోక్యం చేసుకోండి: సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖఈ చర్యతో ప్రతీపౌరుడి వెన్నులో వణుకు; జోక్యం చేసుకోండి: సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ

బట్ట కాల్చి మీదేస్తున్నారు: ఢిల్లీ లిక్కర్ స్కాం పై కవిత ఫైర్

బట్ట కాల్చి మీదేస్తున్నారు: ఢిల్లీ లిక్కర్ స్కాం పై కవిత ఫైర్


ఇక తాజాగా ఈ వ్యవహారం పై స్పందించిన కేసీఆర్ కుమార్తె , నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కావాలని బిజెపి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు ఎటువంటి సంబంధం లేదని కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలకు తెర తీశారని, బట్ట కాల్చి మీద వేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎవరి మీద పడితే వారి మీద ఆరోపణలు చేయడం సరైనది కాదని కేంద్రంలోని బిజెపి సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

 కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారనే ఇలాంటి ఆలోచన

కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారనే ఇలాంటి ఆలోచన


కెసిఆర్ బిడ్డ బిడ్డను బద్నాం చేస్తే కెసిఆర్ భయపడతారని ఇటువంటి ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఇక ఇటువంటి ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం గానే మిగిలిపోతుందని, మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు, ప్రభుత్వం పోరాట పటిమ ఉన్నవారిమని, భయపడి వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించటానికి ఎంతగా పోరాటం చేశామో, అలాగే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోరాటం చేస్తామన్నారు.

 లిక్కర్ స్కాం కు తనకు సంబంధం లేదు..

లిక్కర్ స్కాం కు తనకు సంబంధం లేదు..


కెసిఆర్ ని మానసికంగా క్రుంగదీయాలని చూస్తున్నారని విమర్శించిన కవిత, ఎవరెన్ని కుయుక్తులు పన్నినా భయపడేది లేదన్నారు. మాపై ఎన్ని ఆరోపణలు చేసినా మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. ఇక ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదని పేర్కొన్నారు. కవిత ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేయడం సరైనది కాదని విమర్శించారు. ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కాంలో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె తేల్చిచెప్పారు.

 కేంద్రంపై పోరాటం ఆపేది లేదు

కేంద్రంపై పోరాటం ఆపేది లేదు


కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎండగడుతూ ఉన్నారు కాబట్టే ఇప్పుడు ఈ తరహా చర్యలకు దిగుతున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు అని, తాము పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని కవిత స్పష్టం చేశారు. ఈ విషయంలో దర్యాప్తుకు తాను సహకరిస్తానని పేర్కొన్న కవిత, తనకు ఎలాంటి సంబంధం లేని వ్యవహారంలో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

English summary
MLC Kavitha has clarified that she has nothing to do with the Delhi liquor scam. MLC Kavitha says bjp govt thinks that KCR will be afraid if KCR's child is defamed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X