వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి రెడీ అయిన ఎమ్మెల్సీ కవిత!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ పై గురి పెట్టారా? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని నిర్ణయం తీసుకున్నారా? ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నప్పటికీ, కేంద్రంపై పోరు చేయడానికి మళ్లీ దేశ రాజకీయాలపైనే కవిత దృష్టి సారించనున్నారా? నిజామాబాద్ లో మళ్లీ యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్న కవిత వ్యూహం ఏమిటి? వచ్చే ఎన్నికలలో ఆమె పోటీపై స్థానికంగా జరుగుతున్న చర్చ ఏమిటి?

కవిత ఫోకస్ అక్కడే: ఎమ్మెల్సీ కవిత.. కెసిఆర్ తనయగా రాజకీయాలలో చక్రం తిప్పుతున్న కవిత బి.ఆర్.ఎస్. ముఖ్య నేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మళ్లీ పార్లమెంట్ కు పోటీ చేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా నిజామాబాద్ లో జోరుగా సాగుతుంది. ఇక ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా.. నిజామాబాద్ పార్లమెంట్ పై కవిత ఫోకస్ చేస్తూ.. వివిధ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్రధానంగా కనిపిస్తుంది.

MLC Kavitha is ready to give BJP and mp arvind a return gift!!

జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని క్యాడర్ కు నేనున్నానే భరోసా ఇచ్చారు కవిత. ఇటు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు పై మాట తప్పారంటూ పసుపు రంగు ప్లెక్సీల ఏర్పాటు అంశంలో కూడా ఎన్నికల యుద్దానికి సిద్దం అనే సంకేతాలను పంపడం కోసమే, కవిత ప్రోద్బలంతోనే జరిగినట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది.

అరవింద్ ను వెంటాడి ఓడిస్తానన్న కవిత మాస్టర్ ప్లాన్: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను వెంటాడి, వేటాడి ఓడిస్తానంటూ ప్రకటించిన కవిత.. అందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో తాను పోటీ చేసి.. అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం.

ఈడీ కేసుల అనంతరం తొలిసారిగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న జగిత్యాలలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కవిత, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మరో రెండు మూడు నియోజకవర్గాల్లో జరిగే సమావేశాల్లోనూ పాల్గొనేలా కార్యచరణ రూపొందించుకొని ముందుకు వెళ్ళనున్నారు. నిజామాబాద్ జిల్లాలో మరింత యాక్టివ్ రోల్ పోషించడానికి రంగంలోకి దిగిన కవిత బిజెపి దూకుడుకు చెక్ పెట్టడానికి ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు.

జాతీయ రాజకీయాలపై కవిత ఫోకస్: టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసిఆర్ కవితకు జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించాలని, ఎంపీగా రంగంలోకి దింపడానికి ఆసక్తితో ఉన్నారని తెలుస్తుంది.

గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పొలిటికల్ గా కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించి శాసనమండలిలో అడుగుపెట్టిన కవిత మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ గా పనిచేస్తూ, ఓడిన చోటే గెలవాలని నిజామాబాద్ ఎంపీ స్థానంపై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారని సమాచారం.

MLC Kavitha is ready to give BJP and mp arvind a return gift!!

వాళ్లకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న కవిత: నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో అన్ని అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేలా, అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తీసుకున్న కవిత, ప్రస్తుతం ఎంపీగా ఉన్న అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారని సమాచారం.

ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ అర్బన్, బోధన్, జగిత్యాల నుంచి అసెంబ్లీ బరిలో ఉంటారని రకరకాలుగా ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా ఆమె వేస్తున్న అడుగులు నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ వైపేనని స్పష్టం చేస్తున్నాయి. ఎంపీ అరవింద్ ను ఓడించాలని కసితో ఉన్న కవిత ఇటీవల నిజామాబాద్ లో యాక్టివ్ రాజకీయాలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+