ఇంటి భోజనం కోసం ఫైట్.. నేడే కోర్టులో విచారణ!!
ఎక్కడకు వెళ్ళినా కవితకు పోరాటం తప్పటం లేదు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న కవిత తాను కడిగిన ముత్యంగా బయటకు వస్తానని, ఇది రాజకీయ కేసు అని పదేపదే ఆరోపిస్తున్నారు. ఈడీ అధికారులపైన పోరాటం చేస్తున్నారు. కోర్టు వరుసగా కవితకు షాకులు ఇస్తున్నా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి, ఈడీ విచారణ ఎదుర్కొని, ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈ కేసు నుంచి బయటకు రావాలని శాయ శక్తులా పోరాటం చేస్తుంది. మొన్నటి వరకు ఈ డి అరెస్ట్ అక్రమమని, తనని ఈడి అరెస్టు చేయడానికి సవాల్ చేసిన ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు తీహార్ జైలు అధికారుల పైన యుద్ధం ప్రకటించింది.

తీహార్ జైలు అధికారులు తనకు ఎలాంటి వసతులు కల్పించడం లేదని, తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ , కోర్టు తనకు అనుమతినిచ్చిన వసతులను కూడా కల్పించడం లేదని, జైలు అధికారుల పైన తగిన చర్యలు తీసుకోవాలని తీహార్ జైలు అధికారుల పైన పోరాటం మొదలుపెట్టారు. తనకు ఇంటి భోజనం అనుమతి ఉందని, కానీ తనకు ఇంటి భోజనం తీహార్ జైలు అధికారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
అంతేకాదు పుస్తకాలు, పెన్నులు, పేపర్లు, పరుపులు, బెడ్ షీట్లు, ఆఖరికి తాను జపం చేసుకునే జపమాలను కూడా ఇవ్వలేదని కవిత కోర్టుకెక్కారు. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత దాఖలు చేసిన ఈ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఏప్రిల్ 9వతేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీపై జైలులో ఉండాల్సిన కవిత తీహార్ జైలు అధికారులపైన ఆరోపణలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో, జైలు అధికారులను కోర్టు వివరణ కోరనుంది.
నేడు ఈ కేసును విచారించనున్న నేపథ్యంలో కవిత విన్నపాలను మన్నించి కవితకు కావలసిన వసతులు కల్పిస్తారా? లేక జైలు అధికారులు చెప్పే సమాధానానికి కోర్టు ధర్మాసనం సంతృప్తి చెందుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications