కేసీఆర్ గన్ అయితే ఉద్యోగులు బుల్లెట్లు: కొత్త ఉద్యోగాలిస్తే ఆయనకు బాధన్న ఎమ్మెల్సీ కవిత!!

తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. 2023 నూతన సంవత్సరం సందర్భంగా టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత దేశంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఉద్యోగులు, ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే మనదేశంలో ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు జరుగుతాయని ఈ క్రెడిట్ అంతా ఉద్యోగులు, ఉపాధ్యాయులకే దక్కుతుందని అని కవిత పేర్కొన్నారు. ఉద్యోగుల కష్టంతో దేశం ముందుకు నడుస్తోందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యోగులతో కెసిఆర్ కు ఉన్నది తల్లి పేగు బంధం

తెలంగాణ ఉద్యోగులతో కెసిఆర్ కు ఉన్నది తల్లి పేగు బంధం

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విముక్తి కోసం ఉద్యోగులు నాడు ఎన్నో త్యాగాలు చేశారని, తెలంగాణ ఉద్యోగులతో కెసిఆర్ కు ఉన్నది తల్లి పేగు బంధం అని కవిత అభివర్ణించారు. అంతేకాదు కెసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కెసిఆర్ గన్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్ లని కవిత పేర్కొన్నారు.అందుకు నిదర్శనంగా దేశంలో ఇస్తున్న అవార్డుల్లో ఫస్ట్ మూడు అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే దక్కుతున్నాయి అని కవిత గుర్తుచేశారు.ఉద్యోగుల నిరంతర శ్రమ లేకుంటే తెలంగాణా ప్రగతి సాధ్య కాదన్నారు.

బండి సంజయ్ పై మండిపడిన కవిత

బండి సంజయ్ పై మండిపడిన కవిత

ఇక ఇదే సమయంలో బండి సంజయ్ పై మండిపడిన కవిత ఉద్యోగులు కెసిఆర్ బంధువులుగా భావిస్తుంటే, బండి సంజయ్ లాంటివాళ్ళు ఉద్యోగుల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతగానో పాట పడుతున్నారని కవిత, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని అన్నారు.

కొత్త ఉద్యోగాలు ఇస్తే బండి సంజయ్ తెగ బాధ పడుతున్నారని కవిత ఎద్దేవా చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తుంటే మా వెనక జెండా పట్టుకోవడానికి ఎవరూ లేరని బండి సంజయ్ బాధపడుతున్నారని కవిత ఎద్దేవా చేశారు.

 దేశం మొత్తం తెలంగాణ మోడల్ వైపే చూస్తుంది.. అందుకు కారణం ఉద్యోగులే

దేశం మొత్తం తెలంగాణ మోడల్ వైపే చూస్తుంది.. అందుకు కారణం ఉద్యోగులే

దేశం మొత్తం తెలంగాణ మోడల్ గురించి మాట్లాడుకుంటుంది అని, భవిష్యత్ లో అందరూ తెలంగాణా మోడల్ వైపే చూస్తారని, ఇక ఈ ప్రయాణంలో ప్రభుత్వంలో భాగస్వామ్యం గా ఉన్న ఉద్యోగుల కష్టం కూడా ఉందని కవిత అభిప్రాయపడ్డారు. పిఆర్సి లాంటి విషయాలు చెప్పాలని, ఉద్యోగుల సమస్యలు కుటుంబ సమస్య అని పేర్కొన్న కవిత, ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకోకపోతే తనను దూరం చేసినట్టుగా అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధిలో, సాధిస్తున్న ప్రగతి లో ఉద్యోగుల పాత్ర ఉందన్న కవిత బీహెచ్ఈఎల్, సింగరేణి వంటివి బతికింది తెలంగాణ వల్లనేనని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+