వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా కొలువుల జాతర: 95శాతం స్థానికులకే; మార్చ్9 చరిత్రలోమరచిపోలేని రోజు: ఎమ్మెల్సీ కవిత

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతరకు నోటిఫికేషన్లు నేటి నుండి ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలం నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లేకపోవడంతో నిరాశ చెందిన నిరుద్యోగులు ఈ రోజు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 89,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

సీఎం కేసీఆర్ ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత హర్షం .. చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణన

సీఎం కేసీఆర్ ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత హర్షం .. చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణన

తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ పై సీఎం కేసీఆర్ ప్రకటన పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ రోజు చారిత్రాత్మకమైన రోజని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తడబడిన సందర్భాలేవి లేవని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.76 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని కవిత వెల్లడించారు. ఇటు ప్రైవేటు ఈ రంగంలో కూడా ఉద్యోగాల కల్పనకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిరుద్యోగులు ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కవిత వెల్లడించారు.

కాంగ్రెస్, బీజేపీ ల వల్లే ఉద్యోగాల భర్తీలో జాప్యం

కాంగ్రెస్, బీజేపీ ల వల్లే ఉద్యోగాల భర్తీలో జాప్యం

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ నాయకులు కోర్టులకు వెళ్లడం తోనే ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. నిరుద్యోగుల అవకాశాలకు గండి కొడుతుంది రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు అని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ విషయాన్ని యువత అర్ధం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ


డిసెంబర్ 9 తెలంగాణ సాధన దినోత్సవంగా ఎలా మిగిలి పోతుందో.. అలాగే మార్చి 9 కూడా చారిత్రాత్మకంగా మిగిలిపోతుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా తాము అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అందుకే ఉద్యోగాల భర్తీ విషయంలో కాస్త జాప్యం జరిగిందని కవిత అన్నారు. రాష్ట్ర యువత ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

Recommended Video

Telangana Job Notifications: ఎన్నికల టైం CM KCR Big Announcement | Assembly Sessions |OneindiaTelugu
కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

ఇదే సమయంలో కేంద్రంలో బిజెపి ని టార్గెట్ చేసిన కవిత కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పటికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇది నిజంగా శుభ దినం అని, యువతకు తాను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

English summary
TRS MLC Kavitha expressed happiness over CM KCR announcement on the of large scale jobs in Telangana. Kavitha says 95 per cent of the jobs to locals have amended the President's orders, today as a historic day in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X