నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాడే అండగా ఉన్నాడు..కన్నీళ్లు పెట్టుకున్న కవిత
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్ టాపిక్‌గా మారారు. కవిత తన తండ్రి , మాజీ సీఎం కేసీఆర్‌కు వ్యక్తిగతంగా రాసిన లేఖ బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో తన అన్న కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ తండ్రి కేసీఆర్‌కు కవిత లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ లీక్ అవ్వడం వెనుక కేటీఆర్ అనుచరులు ఉన్నారనే అనుమానం వ్యకం చేశారు కవిత. ఆమె త్వరలోనే కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవిత ప్రముఖ వార్త ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్య్వూలో మధ్య తన పెంపుడు కుక్క గురించి మాట్లాడేటప్పుడు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
యాంకర్ "మిమ్మల్ని వదిలి ఉండదా ఏంటి?" అని ప్రశ్నించగా, కుక్కతో చాలా మంచి బంధం ఉందని, ఎక్కడ మీటింగ్‌లో ఉన్నా, ఎక్కడున్నా అది వచ్చి కూర్చొంటుందని కవిత చెప్పారు.ఆ కుక్కకి ఆరున్నర సంవత్సరాలు అని, తన కష్టంలో చాలా భాగస్వామ్యం పంచుకుందని కవిత అన్నారు.మూడున్నర-నాలుగు సంవత్సరాల క్రితం, ED, CBI దర్యాప్తులు మొదలైనప్పుడు, ఇంట్లో వాళ్లందరూ చాలా ఒత్తిడిలో ఉన్నారని, ఆ సమయంలో హఠాత్తుగా ఒక రోజు తన పెంపుడు కుక్కకి రెండు కళ్ళు పోయాయని కవిత భావోద్వేగంతో చెప్పారు.

అసలు ఏం జరిగిందో తెలియలేదని, చూసేసరికి అది గోడకి గుద్దుకుంటూ ఉందని కవిత తెలిపారు. వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారని చెప్పారు.తాను చాలా బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, తన జీవితంలోకి ఆ కుక్క ఎందుకు వచ్చిందో తెలియదని, కానీ తనపై ఉన్న నెగిటివిటీని అది(పెంపుడు కుక్క) తీసుకుందని చాలా మంది చెప్పారని కవిత అన్నారు. యజమానులకు ఏదైనా జరిగినప్పుడు, పెంపుడు జంతువులు ఆ బాధను పంచుకుంటాయని కొందరు చెప్పినట్లు వివరించారు.
ఆ కుక్కకి ఆరేళ్లు మాత్రమే అని, ఇంకో ఐదు, ఆరు ఏళ్లు జీవించాల్సి ఉందని, అది చాలా కష్టమని అన్నారు.దాని కళ్ళు పోయినప్పటి నుంచి ఇంట్లో ఎలాంటి మార్పులు చేయకుండా, ఫర్నిచర్ అన్నీ అవి ఉన్న చోటే అలానే ఉంచామని, దాని వల్ల అది సులభంగా తిరగగలుగుతుందని చెప్పారు. తన జీవితంలో అలా ఒకరు ఉండటం చాలా మంచిదని, అయితే ఆ కుక్కకి అది కష్టమని కవిత అన్నారు. చివరగా, అది తన జీవితంలో ఒక అందమైన భాగమని, అది తనతో ఉండటం సంతోషంగా ఉందని కవిత చెప్పుకొచ్చారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications