ఆ విషాద వార్త కలిచివేసింది: దత్తాత్రేయకు మోడీ లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్(21) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. కొడుకు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన దత్తాత్రేయకు సానుభూతి తెలియజేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు.

'వైష్ణవ్ చనిపోయాడన్న విషాద వార్త నన్ను కలిచివేసింది. ఇలాంటి సమయంలో దేశం అంతా నీ బాధను పంచుకుంటుంది. మెడిసిన్ చదివి దేశ సేవ చేయాల్సిన అబ్బాయి చనిపోవడం దురదృష్టకరం' అని మోడీ పేర్కొన్నారు.
'మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వైష్ణవ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని దత్తాత్రేయకు రాసిన లేఖలో మోడీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications