కలెక్టర్ ఎదుటే గొడవ పడ్డ మోహన్ బాబు, మంచు మనోజ్
మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.గతేడాది డిసెంబర్‌లో జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.
ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్‌పైన ఆయన భార్య మౌనికపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు భారీగా చేరుకుంది. లోపలకి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు.మీడియా పై మోహన్ బాబు అరాచకం సృష్టించారు. సహనాన్ని కోల్పోయిన మోహన్ బాబు విచక్షణా రహితంగా మీడియా పై దాడి చేశారు.

మైక్ లాగి మరీ మీడియా ప్రతినిధిపై ఆయన దాడి చేశారు. ఈ ఘటనలో సదరు మీడియా ప్రతినిధికి గాయాలు అయ్యాయి.దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇదెలా ఉంటే గతంలో మోహన్‌బాబు వేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం ఇద్దరినీ విచారణకు పిలిచారు.
తొలుత ఒకరి తర్వాత ఒకరితో వేర్వేరుగా కలెక్టర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరినీ కలిపి సమస్యను తెలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత ఎదురుపడటంతో ఆవేశం ఆపుకోలేక తండ్రి, కొడుకు ఏకంగా కలెక్టర్ ఎదుటే దూషించుకున్నట్లు తెలుస్తోంది.నా సంపాదనలో మనోజ్‌కు ఎటువంటి హక్కు లేదని మోహన్ బాబు కలెక్టర్‌కు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.కలెక్టర్‌తో భేటీ అనంతరం మోహన్ బాబు, మనోజ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవడం జరిగింది.












Click it and Unblock the Notifications