మోహన్ బాబుకు తీవ్ర అస్వస్థత..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

మంచు మోహన్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీనిలో భాగంగానే జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీంతో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించింది. వెంటనే తండ్రి మోహన్ బాబును పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో మోహన్ బాబును చేర్పించారు. దీంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. మంగళవారం మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న గొడవలు కారణంగానే మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే మోహన్ బాబు భార్య ఆస్పత్రిలోనే ఉన్నారు.ఇప్పుడు ఆయన కూడా ఆరోగ్యం బాలేకపోవడంతో ఆస్పత్రిలో చేరారు.

ఇక మంచు ఫ్యామిలీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ నిన్న ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్‌పైన ఆయన భార్య మౌనికపైన పోలీసులు కేసు నమోదు చేశారు.

Mohan Babu health deteriorated and he was shifted to the hospital

ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు మోహన్ బాబు నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. లోపలకి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు.మీడియా పై మోహన్ బాబు అరాచకం సృష్టించారు. సహనాన్ని కోల్పోయిన మోహన్ బాబు విచక్షణా రహితంగా మీడియా పై దాడి చేశారు.మైక్ లాగి మరీ మీడియా ప్రతినిధిపై ఆయన దాడి చేశారు. ఈ ఘటనలో సదరు మీడియా ప్రతినిధికి గాయాలయ్యాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మోహన్ బాబు గన్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులకు అదేశాలు జారీ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు గన్ కూడా సీజ్ చేయాలని అధికారులను అదేశించారు.జూబ్లీహిల్స్‌ నుంచి గన్‌ లైసెన్స్‌లు పొందిన మోహన్‌బాబు, విష్ణు.. ఇద్దరి తుపాకుల లైసెన్స్‌లు సీజ్‌ చేసి స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+